Jawan: తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర సృష్టించిన బాద్ షా..!

Jawan:

టాలీవుడ్ లో ఈ వారం రెండు సినిమాలు రిలీజ్ కాగా అందులో ఒకటి తెలుగు సినిమా అయితే, మరొకటి డబ్బింగ్ సినిమా “జవాన్”. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించగా, తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేశాడన్న సంగతి తెలిసిందే. దాదాపు సౌత్ కి చెందిన నటీనటులు, టెక్నిషియన్సే ఈ సినిమాకి పని చేయడం వల్ల సౌత్ మసాలనే సినిమాకి అద్దినట్టయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన జవాన్ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.

రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోగా, పెద్దగా ప్రమోట్ చేయని తెలుగులో కూడా ఈ సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్ తో అదరగొట్టడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా 5000లకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ తో దుమ్ము దులిపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో జవాన్ డబ్బింగ్ సినిమాల్లో కొత్త రికార్డు క్రియేట్ చేసిందని చెప్పాలి. మామూలుగా తెలుగులో రిలీజ్ అయ్యే డబ్బింగ్ సినిమాల్లో మంచి ఓపెనింగ్స్ అంటే తమిళ్ సినిమాలకే వస్తాయి.

కానీ హిందీ నుండి రిలీజ్ అయిన జవాన్ తెలుగులో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 9.40కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అట్లీ తమిళ్ డైరెక్టర్ అయినప్పటికీ జవాన్ కి తమిళ్ కంటే తెలుగులో ఎక్కువ ఓపెనింగ్స్ రావడం విశేషం. ఇక తెలుగు స్టేట్స్ లో హిందీ డబ్బింగ్ సినిమాల పరంగా జవాన్ అల్ టైం ఓపెనింగ్స్ తెచ్చుకుందని చెప్పొచ్చు.

- Advertisement -

ఇక జవాన్ సినిమా వరల్డ్ వైడ్ గా కూడా అల్ టైం రికార్డు ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఏరియా వారీగా చూస్తే..
తెలుగు స్టేట్స్ – 9.40Cr
తమిళ నాడు – 7.40Cr
కర్ణాటక – 7.25Cr
కేరళ – 3.50Cr
రెస్ట్ అఫ్ వరల్డ్ – 61.05Cr
ఓవర్సీస్ – 37.80CR
ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా జవాన్ 126.40 గ్రాస్ వసూలు చేసి ఆల్ టైం ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇక కేవలం హిందీ పరంగా కూడా 65.50కోట్లతో అల్ టైం ఓపెనింగ్స్ తెచ్చుకుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు