Vijay devarakonda:ఖుషి ఫస్ట్ వీక్ లెక్క. టాక్ హిట్టే! కానీ ప్లాప్?

Vijay devarakonda:

టాలీవుడ్ లో ఈ ఇయర్ లో భారీ అంచనాలతో రిలీజ్ లవ్ స్టోరీల్లో ఖుషి ఒకటి. విజయ్ సమంత కాంబో వల్ల మంచి క్రేజ్ ఏర్పడిన ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు కావడం తో ముందు నుండి మంచి పాజిటివ్ బజ్ ఉంది. పైగా రిలీజ్ కి ముందే పాటలు యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ఖుషి బ్లాక్ బస్టర్ అవడం కన్ ఫర్మ్ అని విజయ్, సామ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక రిలీజ్ అయ్యాక కూడా మరి బ్లాక్ బస్టర్ రేంజ్ లో కాకపోయినా, డీసెంట్ సినిమా అనిపించుకుంది.

అయితే ఖుషి సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు చూసి దాదాపు 100కోట్లకి పైగా ఈ సినిమా కలెక్షన్లు సాధించొచ్చని నెటిజన్లు అంచనా వేశారు. అయితే ఖుషి రెండో రోజు నుండే పడిపోవడం స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ డే దాదాపు 15కోట్లకి పైగా షేర్ సాధించగా, వీకెండ్ పూర్తయ్యే సరికి 30కోట్లతో సరిపెట్టుకుంది. తాజాగా మొదటివారం ఫినిష్ అయ్యే సరికి ఖుషి కలెక్షన్లు ట్రేడ్ వర్గాల వారికీ కూడా షాక్ ఇచ్చాయి. ఖుషి సినిమా ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి తెలుగు రాష్ట్రాల్లో 23.55కోట్ల షేర్ రాబట్టగా, కర్ణాటక 3.20 కోట్లు, ఓవర్సీస్8.50కోట్లు, ఇతరభాషల్లో కలిపి మరో3.05కోట్లు వసూలు చేసింది.

ఓవరాల్ గా ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యే సరికి వరల్డ్ వైడ్ గా 38.30కోట్ల షేర్, 71.95కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే ఖుషి సినిమా 53కోట్ల బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 15కోట్లయినా వసూలు చేయాలి. అయితే సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రెండు కూడా పాజిటివ్ టాకే తెచ్చుకోవడంతో ఖుషి సినిమా కలెక్షన్లు ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. మహా అయితే ఈ వీకెండ్ లో మరో రెండు మూడు కోట్లు అందుకోవచ్చు. పైగా వర్షాల ప్రభావం కూడా సినిమాపై బాగా పడింది. అంటే ఖుషి సినిమాకి టాక్ బాగా వచ్చినా టైం కలిసిరాలేదు. టాక్ పరంగా హిట్టే అయినా, ఓవరాల్ రిజల్ట్ పరంగా ప్లాప్ అన్నమాటే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు