Satyam Rajesh: వర్కింగ్ డే పాసైపోయిన పొలిమేర2!

టాలీవుడ్ లో ఈ వారం ఏ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమా “పొలిమేర2”. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో లాస్ట్ ఇయర్ హాట్ స్టార్ ఓటిటి లో వచ్చిన మా ఊరి పొలిమేర కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మౌత్ టాక్ తో సినిమా సాలిడ్ వసూళ్లు అందుకుంటూ సూపర్ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత హర్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన బెస్ట్ మూవీ అంటూ ఆడియన్స్ అంటున్నారు. ఇక పొలిమేర2 రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోగా, ఆ మూడో రోజుకే లాభాల్లోకి అడుగుపెట్టింది.

Polimera2: జస్ట్ 3 డేస్ టార్గెట్ ఔట్!

- Advertisement -

ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినప్పటికీ లాభాల్లోకి రావాలని ప్రతి నిర్మాతకి ఆశ ఉంటుంది. అలాగే పొలిమేర2 వర్కింగ్ డే లోకి అడుగుపెట్టింది కాబట్టి, ఎక్కువ వసూళ్లు రావని కొందరు భావించారు. కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ పొలిమేర2 వర్కింగ్ డే అయిన సోమవారం నాడు కూడా భారీ కలెక్షన్లను అందుకుంది.

రిలీజ్ అయిన నాలుగో రోజు పొలిమేర2 తెలుగు రాష్ట్రాల్లో 86 లక్షలకి పైగా షేర్ సాధించింది. ఇక పొలిమేర2 నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 6.22 కోట్ల షేర్, 11.85 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, 2.20 కోట్ల కి పైగా ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు