Naga Babu: జబర్దస్త్ కి కొత్త యాంకర్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ..!

తెలుగు టెలివిజన్ లో బాగా పాపులర్ అయిన షో జబర్దస్త్. మొదట అనసూయతో మొదలైన ఈ షో ప్రజలలో మంచి పాపులారిటీ దక్కించుకుంది. దీంతో ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా ప్రారంభించారు. ఇందులో అనసూయ తరువాత రష్మీ యాంకర్ గా రావడంతో గ్లామర్ గా కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది ఈ షో. వీరిద్దరూ యాంకర్లుగా.. రోజా, నాగబాబు షో కి తొలిసారి జడ్జిలుగా వ్యవహరించారు. అలా చాలాకాలం దూసుకెళ్లిన ఈ షో నుండి పలు కారణాలవల్ల తొలుత నాగబాబు తప్పుకున్నారు.

Read More: Jabardasth Beauty: అనసూయ కు అలా పిలిస్తే చాలా కోపం వస్తుందట

ఆ తర్వాత రోజా, అనసూయ కూడా ఈ షో నుండి తప్పుకోవడంతో రేటింగ్ లో ఈ షో వెనకబడింది. ఈ షో కి ఇప్పుడు కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జిలుగా వ్యవహరిస్తుండగా.. సౌమ్య రావు యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఈమె తన అందంతో, వచ్చిరాని తెలుగులో ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈమెకి అందరూ కనెక్ట్ అవుతున్నారు అనుకునే సమయంలో ఇప్పుడు మరో కొత్త యాంకర్ ని పరిచయం చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోతో కొత్త యాంకర్ ని పరిచయం చేశారు.

- Advertisement -

ఆమె మరెవరో కాదు యూట్యూబర్ గా మంచి పేరు తెచ్చుకొని.. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత దగ్గరైన సిరి హన్మంతు. ఈమె అచ్చతెలుగు అమ్మాయి. చాలా కష్టపడి సొంతంగా పరిశ్రమంలో ఎదిగిన అమ్మాయి. జబర్దస్త్ లో మొదటి ఎపిసోడ్ లో వైట్ డ్రెస్ తో ఏంజిల్ లా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అమ్మాయి ఎన్ని రోజులు యాంకరింగ్ చేస్తుందో వేచి చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు