KeedaaCola: తరుణ్ కంటెంట్‌తో దెబ్బేస్తే! జనాలు కల్లెక్షన్స్‌తో దెబ్బేసారు?

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ‘కీడా కోలా’ ఒకటి. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. నవంబర్ 3న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోగా, వీకెండ్ లో పరవాలేదనిపించుకుంది. అయితే బిజినెస్ ఎక్కువ కావడం వల్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం కష్టమైంది.

ఇక మొదటి వీకెండ్ లో పరవాలేదనిపించిన కీడా కోలా వర్కింగ్ డే లో షాకిచ్చింది. వర్కింగ్ డే అయిన సోమవారం కీడా కోల కేవలం 32లక్షల షేర్ మాత్రమే సాధించింది. సోషల్ మీడియా లో ఇప్పటికే కీడా కోల రిజల్ట్ పై ట్రోలింగ్ కూడా మొదలైంది. తరుణ్ భాస్కర్ కంటెంట్ దెబ్బేసాడు కాబట్టి, జనాలు కలెక్షన్ల దెబ్బేసారు అని కామెంట్స్ చేస్తున్నారు.

Tharun Bhascker: కీడా కోలా 3డేస్ లెక్క.. తగ్గింది! అంటే?

- Advertisement -

ఓవరాల్ గా కీడా కోల నాలుగురోజుల్లో వరల్డ్ వైడ్ గా 6.12 కోట్ల షేర్ ని సాధించగా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2.88 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టాలి. అయితే పొలిమేర2 బ్లాక్ బస్టర్ ప్రభావం వల్ల కీడా కోల కి చాలా దెబ్బపడిందని చెప్పొచ్చు. అయినా ఓవర్సీస్ లో బాగానే ఆడుతున్న కారణంగా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్లే ఛాన్స్ ఉంది. మరి చూడాలి కీడా కోలా ఓవరాల్ కలెక్షన్లు ఎంత వరకు వస్తాయో.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు