Tharun Bhascker: కీడా కోలా 3డేస్ లెక్క.. తగ్గింది! అంటే?

టాలీవుడ్ లో ఈ వారం చిన్న సినిమాలు బాగానే రిలీజ్ అయినా అందులో ఎక్కువ బజ్ తో రిలీజ్ అయిన సినిమా “కీడా కోల”. తరుణ్ భాస్కర్ నటిస్తూ నిర్మించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్సడ్ రెస్పాన్స్ ని అందుకున్నా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ అందుకుంది. తరుణ్ భాస్కర్ ఫాలోయింగ్ మహిమతోనే అది సాధ్యమైందని చెప్పొచ్చు. క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన కీడా కోలా ఫస్ట్ డే రెండున్నర కోట్లకి పైగా షేర్ సాధించగా, ఆ తర్వాత మాత్రం నెమ్మదించింది.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కీడా కోలా కల్లెక్షన్ల వివరాలు బయటికి వచ్చేసాయి. మూడోరోజు భారీ మార్జిన్ తో కీడా కోల కి కలెక్షన్స్ వస్తాయని అనుకున్నా, అంత కాకున్నా 60 లక్షల వరకు కలెక్షన్స్ సాధించి డీసెంట్ అనిపించుకుంది. కానీ ఇదే సమయంలో ఓవర్సీస్ లో అదరగొట్టింది. తెలుగు స్టేట్స్ కి సమానంగా అక్కడ కలెక్షన్లు రావడం విశేషం.

Tharun Bhascker: ‘కీడా కోలా’ ఇక్కడంత లేదుగాని..?

- Advertisement -

ఇక మూడు రోజులకు గాను కీడా కోల తెలుగు రాష్ట్రాల్లో 3.05 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ గా 5.55 కోట్ల షేర్ ని, 10.75 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అయితే కీడా కోలా 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అవగా, వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.45 కోట్లు రాబట్టాలి.

కీడా కోలా కి పోటీ గా పొలిమేర2 రిలీజ్ కాకుండా ఉంటే ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉండేది. అయితే కీడా కోలా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవగా, సోమవారం రోజు వచ్చే కలెక్షన్లను బట్టి కీడా కోలా ఎంత వరకు బ్రేక్ ఈవెన్ అవ్వచ్చో చెప్పొచ్చు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు