Sanjay Dutt: సౌత్ ఇండస్ట్రీలో సంజయ్ దత్ డామినేషన్?

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ సౌత్ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టాడు. కేజీఎఫ్ 2లో విలన్ రోల్ చేసిన తర్వాత సంజయ్ దత్, బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల విజయ్ దళపతి, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన లియో సినిమాలో కూడా విలన్ పాత్రలో కనిపించాడు సంజయ్ దత్. అలాగే మరిన్నీ సినిమాలకు కూడా సంజయ్ దత్ సైన్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న చిత్రం డబుల్ ఇస్మార్ట్.

Read More: Sanjay Dutt : టాలీవుడ్ పై గురి..

లైగర్ లాంటి ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ తన కెరీర్ ను నిలబెట్టుకోవడానికి చేస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. రామ్ పొతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు ఇది సీక్వెల్ గా రానుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న డబుల్ ఇస్మార్ట్ వచ్చే ఏడాది మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతుంది.
అయితే డబుల్ ఇస్మార్ట్ లో విలన్ పాత్ర చేస్తున్నాడు సంజయ్ దత్. నెగిటివ్ రోల్స్ చేయడానికి తెలుగులో చాలా మంది నటులు ఉన్నారు. కానీ, అందరూ సంజయ్ దత్ నే కోరుకుంటున్నారు. దీనికి కారణం… అప్పట్లో వచ్చిన కేజీఎఫ్ 2 గానీ, ఇటీవల వచ్చిన లియో గానీ అని చెప్పొచ్చు. విలన్ గా సంజయ్ దత్ గంభీరంగా కనిపిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో కూడా సినిమాకు మార్కెట్ చేసుకోవచ్చు. అందువల్లే.. సౌత్ సినిమాల్లో విలన్ పాత్ర కోసం సంజయ్ దత్ ఫస్ట్ ఆప్షన్ అవుతున్నాడు.
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ లో విలన్ పాత్ర చేయడానికి సంజయ్ దత్ ఏకంగా 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఆయనకు ఉన్న డిమాండ్ ను బట్టి చూస్తే ఇది తక్కువే అని అంటున్నారు సినీ విశ్లేషకులు.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు