Biggboss season7: ఆడియన్స్ దృష్టిలో మరింత దిగజారిన రతిక!

బిగ్ బాస్ సీజన్ 7 లో తొమ్మిదో వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్ అవగా, అందులో చాలా ఇంట్రెస్టింగ్ సీన్లు ఆడియన్స్ ని ఖుషి చేసాయి. అయితే ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ తేజ అని ముందే లీక్ అయిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా సాగింది.

Biggboss season7: ఎలిమినేట్ అయిన తేజ! ఊహించలేదు!

ఇక ఈ ఎలిమినేషన్ టైం లో చివరగా తేజ, రతిక మాత్రమే మిగలగా, ఆ టైం లో రతిక ఎలిమినేషన్ ప్రాసెస్ జరగక ముందే ఏడుపు మొహం తో నాగార్జునని ఈ ఒక్క వారం ఛాన్స్ ఇవ్వమని బతిమిలాడింది. రెండు వారాలు నా ఆట చూసారు, ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి, ఇంకొక్క వారం ఇవ్వండి అని రతిక అడుక్కోవడం మరీ ఇరిటేటింగ్ గా అనిపించింది. నాగార్జున అక్కడికి ఇది నా చేతుల్లో ఉండదమ్మా ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది అని చెప్పారు.

- Advertisement -

అయితే పక్కనే ఉన్న తేజ తానే ఎలిమినేట్ అవుతానని ప్రిపేర్ అయ్యి, రతిక ని ఓదారుస్తూ ఉన్నాడు. అయినా సరే ఏడుస్తూ ఉంది. ఇక్కడితో ఆడియన్స్ దృష్టిలో రతిక మరింత దిగజారిపోయిందని సోషల్ మీడియా లో వస్తున్న ట్రోలింగ్స్ చూస్తే తెలిసిపోతుంది. మరి అంత బతిమిలాడుకున్న రతిక, అదృష్టం కొద్దీ సేవ్ అవగా, మరి తాను చెప్పినట్టు ఈ వారం అయినా ఆడుతుందో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు