Polimera2: జస్ట్ 3 డేస్ టార్గెట్ ఔట్!

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో పొలిమేర2 ఒకటి. ఓటిటి లో వచ్చిన మా ఊరి పొలిమేర సినిమాకి రెండో పార్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని సాలిడ్ రెస్పాన్స్ తో థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుంది. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్.

అయితే ఈ సినిమాపై రిలీజ్ కి ముందు వరకు పెద్దగా బజ్ లేదు. కేవలం ఓటిటి లో వచ్చిన రెస్పాన్స్ అడ్వాంటేజ్ తో రిలీజ్ కాగా, మౌత్ టాక్ తో ఈవినింగ్ షోలతో దుమ్ములేపింది. ఇక పొలిమేర2 రిలీజ్ అయిన ఫస్ట్ డే నే అన్ని అంచనాలని మించి పోయి కోటిన్నర కి పైగా వసూలు చేయగా, రెండో రోజు కూడా అదే జోరుని కొనసాగించింది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 3.49 కోట్ల షేర్ ని సాధించగా బ్రేక్ ఈవెన్ కి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

Box Office: రెండో రోజు పొలిమేర2 సూపర్ కలెక్షన్స్..

- Advertisement -

తాజాగా మూడో రోజు భారీ కలెక్షన్లు సాధించి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాక, లాభాల్లోకి అడుగుపెట్టింది. తొలి రెండు రోజులని మించి మూడో రోజు సాలిడ్ కలెక్షన్లు వసూలు చేసిన పొలిమేర కేవలం తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు 1.60 కోట్ల షేర్ ని, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 4.60 కోట్ల షేర్ ని వసూలు చేసింది.

ఇక వరల్డ్ వైడ్ గా పొలిమేర2 మూడు రోజుల్లో 5.25 కోట్ల షేర్ ని 10 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక 4కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడమే గాకుండా 1.25 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది. పొలిమేర మేకర్స్ కి ఇకపై భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు