VarunLav: వరుణ్ – లావణ్య రిసెప్షన్… ఎన్నో డౌట్స్.. ఇంకెన్నో ప్రశ్నలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో జరిగింది. రిసెప్షన్ అయితే జరిగింది… కానీ, దీనిపై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే.. మెగా కంపౌండ్ లో ని హీరో, అందులోని మెగా బ్రదర్ నాగ బాబు కుమారుడి రిసెప్షన్ వేడుక అంటే.. మినిమం హంగామా ఉంటుందని అందరూ అనుకుంటారు.

Read More:Varun tej: పెళ్లి తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి?

తెలుగు ఇండస్ట్రీనే కాదు.. ఇతర ఇండస్ట్రీల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు ఈ ఈవెంట్ కి వస్తారని అందరూ అంచనా వేశారు. కానీ, ఆదివారం నాటి రిసెప్షన్ లో మాత్రం అలాంటి హంగామా కనిపించలేదు. ఇతర ఇండస్ట్రీలను పక్కన పెడితే, కనీసం తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దగా గెస్ట్ లు రాలేదు. అంత ఎందుకు బాబాయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ రిసెప్షన్ లో కనిపించలేదు.

- Advertisement -

Read More:#VarunLav: లావణ్య త్రిపాఠి ధరించిన పెళ్లి చీర ధర ఎంతో తెలుసా..?

పవన్ కి అంటే.. ఎలెక్షన్ టైం, అందులోనూ టీడీపీ చీఫ్ చంద్రబాబు జైల్ నుంచి బయటికి రావడం లాంటి కారణాలు ఉన్నాయి. మరి మిగితా హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోయిన్లు ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే, గెస్ట్ లను ఆహ్వానించడంలో మెగా బ్రదర్ కాస్త అలసత్వం చూపించాడనే టాక్ కూడా ఉంది. కానీ రిసెప్షన్ కి వెళ్లని వాళ్లు మాత్రం దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు