Eagle: టీజర్ తో కన్ఫర్మేషన్ ఇచ్చిన రవన్న!

టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్లాప్ తో డీలా పడ్డ రవితేజ మళ్ళీ పుంజుకోవాలని చూస్తున్నాడు. ఈ ఇయర్ మూడు సినిమాలతో ఆడియన్స్ ని పలకరించిన రవితేజ వెంట వెంటనే రెండు ప్లాప్స్ రావడంతో కొంచెం గ్యాప్ తీసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ రవితేజ అవేమి పట్టించుకోకుండా తన ప్లానింగ్ లో ఉన్నాడు. తన తదుపరి సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ గా ఉన్నాడు.

లేటెస్ట్ గా రవితేజ ఈగల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ అనౌన్స్ మెంట్ టైం లోనే సంక్రాంతి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయగా, గత కొన్ని రోజులుగా ఈగల్ అప్డేట్స్ ఏమి లేకపోవడంతో సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేసి అందరికి రిలీజ్ డేట్ పై ఉన్న డౌట్స్ కి క్లారిటీ ఇచ్చారు.

Raviteja: ఈగల్ టీజర్: ఇది విధ్వంసం మాత్రమే..

- Advertisement -

టీజర్ చివరలో 2024 జనవరి 13న సంక్రాంతికి వస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ కన్ఫర్మేషన్ తో ఫ్యాన్స్ కూడా ఖుషి అయిపోగా, టీజర్ కూడా సాలిడ్ గా ఉండడంతో సంక్రాంతికి భారీ పోటీ ఉండనుందని అర్ధమైపోయింది. ఇక సంక్రాంత్రికి వచ్చే సినిమాల్లో సైన్ధవ్ తో పాటు, ఈగల్ కూడా కంఫర్మ్ అయ్యిందని చెప్పొచ్చు.

క్రిస్మస్ కల్లా ఈగల్ షూట్ మొత్తం పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉంటుందని చిత్ర యూనిట్ నుండి సమాచారం అందింది. ఇక గుంటూరు కారం, హనుమాన్ సినిమాల గురించే క్లారిటీ రావాల్సి ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు