Raviteja: ఈగల్ టీజర్: ఇది విధ్వంసం మాత్రమే..

మాస్ మహారాజా రవితేజ ఎక్కడా తగ్గట్లేదు. ఈ ఇయర్ మూడు సినిమాలతో వచ్చిన రవన్న రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు గా వచ్చి ప్లాప్ అందుకున్నాడు. ఇలాంటి టైం లో జనరల్ గా ఎవరైనా కొంత గ్యాప్ తీసుకుంటారు. కానీ మాస్ రాజా కి అవేమి వర్తించవు. ఎవరేమనుకున్నా తగ్గేదేలే అన్నట్టు, ఈ సంక్రాంతికి ఈగల్ తో రావడానికి ఫిక్స్ అయిపోయాడు.

తాజాగా “ఈగల్” ఆఫీసియల్ టీజర్ రిలీజ్ అయింది. సినిమా అనౌన్స్ చేసినపుడు పెద్దగా బజ్ లేదు గాని, ఒక్క మాటలో ఈగల్ టీజర్ రిలీజ్ అయ్యాక లెక్కలన్నీ మార్చేశాడు రవితేజ.

టీజర్ లో కాన్సెప్ట్స్ చెప్పకుండా, స్టోరీ లైన్ ఏమి రివీల్ చేయకుండా ఎలివేషన్స్ తో నింపేసాడు. టీజర్ మొదలవడమే డార్క్ సీన్స్ తో మొదలై ఒక్కో నటుడు ఈగల్ ని ఎలివేషన్స్ తో హై చేస్తారు. ఒక్క డైలాగ్ తో చెప్పాలంటే ఇది విధ్వంసం మాత్రమే.. తర్వాత చూడబోయేది విశ్వరూపం అని చెప్పాక ఆ వెంటనే రవితేజ లుక్ ని రివీల్ చేస్తారు.. ఆ ఒక్క షాట్ తో సినిమాపై ఉన్న అంచనాలని రెట్టింపు చేసింది. ఇక ఈ సినిమాలో మాస్ రగ్గడ్ లుక్ తో సూపర్ గా ఉన్నాడు రవితేజ.

- Advertisement -

ఇక సినిమాపై మేకర్స్ కూడా ఎక్కడా తగ్గకుండా ఖర్చు చేసారని క్వాలిటీ చూస్తుంటే అర్ధమవుతుందని. టీజర్ కట్స్ తో పాటు లౌ సౌండింగ్ ఉన్న బిజిఎమ్ ఆకట్టుకుంది.

కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టిజి విశ్వ ప్రసాద్ వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి డావ్ జాన్డ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈగల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కావ్య థప్పర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈగల్ ని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు