Box Office: రెండో రోజు పొలిమేర2 సూపర్ కలెక్షన్స్..

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో పొలిమేర2 మంచి టాక్ తెచ్చుకోగా, ఆడియన్స్ అంచనాలను అందుకొని చిన్న సినిమాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇక దీనికి పోటీగా కీడా కోలా లాంటి క్రేజీ సినిమా ఉన్న కూడా మంచి కలెక్షన్లు సాధించడం విశేషం. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా చాలా రోజుల తర్వాత ఒక మంచి హర్రర్ (భయపెట్టే) మూవీగా నిలిచింది. ఈ సినిమాలో సత్యం రాజేష్ బాగా నటించి మెప్పించాడు.

ఇక ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 1.51 కోట్లకి పైగా షేర్ సాధించిన ఈ సినిమా రెండో రోజు సూపర్ హోల్డ్ ని సాధించి, సాలిడ్ వసూళ్లు అందుకుంది. రెండో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో 1.46 కోట్ల కి పైగా షేర్ ని సాధించింది.

Satyam Rajesh:పొలిమేర2 ఫస్ట్ డే కల్లెక్షన్స్.. అన్ని అంచనాలని మించిపోయింది!

- Advertisement -

ఇక పొలిమేర 2 రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 2.97 కోట్ల షేర్ వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 3.51 కోట్ల షేర్ ని 6 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. 4కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన పొలిమేర2 మరో 49 లక్షలు అందుకుంటే సరిపోతుంది. ఇక మూడో రోజు తో ఆ టార్గెట్ ని కూడా అందుకుని లాభాల్లోకి ఎంటర్ అవుతుందని చెప్పేయొచ్చు.

ఇక ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం పొలిమేర2 తొలివారం పూర్తయ్యే లోపు డబల్ రేంజ్ లో లాభాలు అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు