Tollywood: అప్పుడు వీరయ్య గెలిస్తే.. ఇప్పుడు వీర సింహుడు!

టాలీవుడ్ లో ఈ ఇయర్ సంక్రాంతి కి సీనియర్ హీరోల సమరం జరిగిందన్న సంగతి తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య గా వస్తే నటసింహం బాలకృష్ణ వీర సింహ రెడ్డి గా వచ్చాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఈ సీనియర్ స్టార్స్ తలపడగా, అందులో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఇక వీర సింహారెడ్డి భారీ ఓపెనింగ్స్ అందుకున్నా లాంగ్ రన్ లో అంతగా ఆడలేక బ్రేక్ ఈవెన్ మాత్రమే అయ్యి, సెమి హిట్ గా నిలిచింది.

అయితే తాజాగా వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య పై పైచేయి సాధించాడు. అయితే అది వెండితెర మీద కాదు… బుల్లితెర మీద..
అవును..

Waltair Veerayya: మెగా రికార్డు.. చాలా రోజుల తర్వాత సిల్వర్ జూబ్లీ

- Advertisement -

రెండు నెలల కిందట వీర సింహారెడ్డి టెలివిజన్ లో టెలికాస్ట్ అవగా, 8.83 టిఆర్ పి రేటింగ్ తెచ్చుకుని పరవాలేదనిపించుకుంది. తాజాగా వాల్తేరు వీరయ్య కూడా రిలీజ్ అయింది. అయితే అనూహ్యంగా వాల్తేరు వీరయ్య కేవలం 5.15 రేటింగ్ మాత్రమే తెచ్చుకుంది. పైగా ఆరోజు ఇండియా మ్యాచ్ కూడా ఉండడం దెబ్బేయగా, మెయిన్ రీసన్ టీవీ లో లేట్ గా రిలీజ్ అవడం దెబ్బేసింది.

కారణాలేవైనా ఈ విధంగా వీర సింహారెడ్డి ఈ విధంగా వీరయ్య పై గెలవగా, ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ గెలిస్తే, టెలివిజన్ లో బాలయ్య గెలిచాడని చెప్పొచ్చు.

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు