Waltair Veerayya: మెగా రికార్డు.. చాలా రోజుల తర్వాత సిల్వర్ జూబ్లీ

మెగాస్టార్ చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” ఏ స్థాయి విజయం సాధించిందో తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ప్లాపుల తర్వాత చిరంజీవికి భారీ కమ్ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి చిరు స్టామినా ఏంటో చెప్పిన చిత్రమిది. ఈ ఏడాది సంక్రాంతికి మాములు రొటీన్ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, వింటేజ్ చిరు మాస్ పెర్ఫార్మన్స్ తో మాస్ రాజా రవితేజ ఎనర్జిటిక్ యాక్షన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు చిరు పై వచ్చిన ట్రోల్స్ అన్నీ వాల్తేరు వీరయ్య తో తొలగిపోయాయి.

వీరసింహారెడ్డి గా వచ్చిన బాలకృష్ణ తో పోటీపడిన చిరంజీవి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ కొట్టడమే గాకుండా సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డు సృష్టించింది. జనవరి 13న విడుదలైన వాల్తేరు వీరయ్య ఈరోజు (జులై6) తో 175రోజులను పూర్తి చేసుకుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతంలో “రామకృష్ణ థియేటర్” లో రోజుకు 4 ఆటలతో ఈ ప్రదరించబడి నేటితో 175డేస్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది.

లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో సిల్వర్ జూబ్లీ చేసుకున్న అతి తక్కువ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మించగా ఈ ఏడాది అత్యధిక లాభాలు(48కోట్లు) తెచ్చి పెట్టిన సినిమాగా నిలిచింది. దాదాపు 237కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటికీ తెలుగులో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా కొనసాగుతుంది.

- Advertisement -

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు