Salaar: డిసప్పాయింట్ మెంట్ కి కారణం ఎవరు..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ సంచలనం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సాలార్ సినిమా టీజర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు నార్మల్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూసిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తి పెంచినప్పటికీ ఆశించిన స్థాయిలో లేదంటూ కొంతమంది పెదవి విరుస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో కూడా ‘#Disappointed’ అన్న హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నిజానికి టీజర్లో పెద్దగా లోపాలేవి లేనప్పటికీ సినిమాకి క్రియేట్ అయిన హైప్ మైనస్ అయ్యిందని చెప్పాలి. కేజిఎఫ్ పార్ట్1 ని మించిన స్థాయిలో పార్ట్2 సినిమా ఉండటంతో ప్రశాంత్ నీల్ కి రెండవ బ్లాక్ బస్టర్ దక్కింది. ఈ క్రమంలో కేజిఎఫ్2 తర్వాత వస్తున్న సలార్ సినిమా కూడా కేజిఎఫ్ ని మించిన స్థాయిలో ఉంటుందని అంచనాలు ఏర్పడటం కూడా ఈ టీజర్ పై నెగిటివ్ కామెంట్స్ రావటానికి ఒక కారణం అని చెప్పచ్చు.

కేజిఎఫ్2 సమయంలో ప్రతి అప్డేట్ తో సినిమాపై హైప్ పెంచుతూ వచ్చిన ప్రశాంత్ నీల్, సలార్ విషయంలో ఆ రేంజ్ లో సక్సెస్ కాలేకపోయాడు. ముందు నుండి ప్రచారం జరిగినట్టే ఈ సినిమాకి కేజిఎఫ్ తో లింక్ ఉన్నట్టు టీజర్లో హింట్స్ కనిపించటంతో కథ విషయంలో ఊహాగానాలు మొదలు పెట్టారు నెటిజన్లు. టీజర్లో ప్రభాస్ కి ఒక్క డైలాగ్ కూడా లేకపోవటం పట్ల కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి ఆదిపురుష్ ఆశించిన స్థాయిలో లేకపోవటం వల్ల నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులకు సలార్ టీజర్ రూపంలో ప్రశాంత్ నీల్ మరింత నిరాశ మిగిల్చాడని చెప్పాలి.

ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. సుమారు 400కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కి నెగిటివిటి వచ్చిన నేపథ్యంలో సినిమా యూనిట్ ఏమైనా జాగ్రత్త పడి ఫ్యాన్స్ శాటిస్ఫై చేసే విధంగా మరో అప్డేట్ ఏమైనా రిలీజ్ చేస్తుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు