Sree Vishnu: ఫస్ట్ వీక్ కుమ్మేసిన సామజవరగమన

టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం సామజవరగమన. జూన్29న విడుదలైన ఈ సినిమా మంచి మౌత్ టాక్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద అబ్బురపరిచే వసూళ్ళని సాధిస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక చక్కని కామెడీ& ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాలో రెబ మోనికా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సాధించిన మొదటి వారం కలెక్షన్లను ఒకసారి ఏరియా వారీగా గమనిస్తే..

నైజాం 2.27cr, సీడెడ్ 64lakhs, ఆంధ్ర 2.41cr ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5.32 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి 2.45cr రాబట్టింది. విడుదలైన వారం రోజుల్లో సామజవరగమన ప్రపంచ వ్యాప్తంగా 7.77cr షేర్ ని 15కోట్ల వరకు గ్రాస్ ని రాబట్టింది. ఇక ఈ సినిమా కేవలం 3.50 కోట్ల బిజినెస్ చేయగా ఇప్పటివరకు సాధించిన వసూళ్లతో లెక్కిస్తే 4.27 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక దీనికి పోటీగా విడుదలైన “స్పై” సినిమా నెగిటివ్ టాక్ తో తన పరుగును దాదాపు ముగించుకున్నట్టే చెప్పాలి. చాలా ఏరియాల్లో స్పై మూవీని తీసేసి సామజవరగమన చిత్రాన్ని ఆడిస్తున్నారు. ఇక ఈ వారం పెద్దగా అంచనాలున్న సినిమాలేవి రిలీజ్ కావడం లేదు కాబట్టి శ్రీ విష్ణు సినిమాకి అది అడ్వాంటేజ్ గా మారనుంది. ఇక సామజవరగమన చిత్రం ఫుల్ రన్ లో 20 నుండి 25 కోట్ల వరకు కల్లెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు