Siva Kartikeyan : టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కోలీవుడ్ సినిమాల పోటీ !

ఉదయనిధి స్టాలిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం మామన్నన్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ్ సినిమా ఇటీవలనే రిలీజై, కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించగా, ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో నాయకుడు పేరుతో డబ్ చేసి, రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

వచ్చే వారం థియేటర్స్ లో రిలీజయ్యే తెలుగు సినిమాలేవీ పెద్దగా లేవకపోవడంతో మామన్నన్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ పలు తమిళ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పరిచయమున్న నటుడే అవ్వడంతో ఈ సినిమాని తెలుగులో గ్రాండ్ గానే రీలిజ్ చేయనున్నట్టు సమాచారం. వడివేలు మరియు మలయాళం స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జులై 14 న థియేటర్స్ లో సందడి చేయబోతుంది.

అయితే ఈ సినిమాతో పాటుగా మరో తమిళ్ సినిమా కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ గా ఉంది. శివ కార్తికేయన్ హీరోగా అదితి శంకర్ హీరోయిన్ గా నటించిన మహావీరన్ సినిమా తెలుగులో మహావీరుడు పేరుతో రిలీజ్ అవడానికి రెడీ అయింది. తెలుగులో శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉండటంతో తెలుగు, తమిళ్ లో ఈ సినిమా జులై 14న ఏకకాలంలో రిలీజ్ అవబోతుంది. సూపర్ హీరో కాన్సెప్ట్ రాబోతున్న ఈ సినిమా మరియు పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాయకుడు సినిమా ఒకే రోజు తలపడుతుండగా, తెలుగు ప్రేక్షకులు మరి ఏ సినిమాకు పట్టం కడతారో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు