Game changer :రామ్ చరణ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడా..? ఏంటి ఈ సడన్ షాక్

గ్లోబల్ స్టార్ట్ రామ్ చరణ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడా..? ఏంటి ఆల్రెడీ షూటింగ్ అయిపొయిందా ? టీజర్ కూడా యూట్యూబ్ లోకి వచ్చేసిందా.. అయితే అసలు ఇదంతా ఎప్పుడు జరిగిందనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా.. విషయం ఏంటంటే..

ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా తెలిసేలా చేసింది. అంతే కాదు ప్రతిష్టాత్మక అవార్డు అయిన ఆస్కార్ వరకు వెళ్లి టాలీవుడ్ సత్తాను చాటింది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ వరల్డ్ వైడ్ పాపులర్ యాక్టర్స్ అయిపోయారు. దాంతో ప్రముఖ కంపెనీలన్ని వీరిద్దరిని బ్రాండ్ అంబాసిటర్లుగా పెట్టుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉండగా ఇటీవలనే రామ్ చరణ్ కు కూతురు పుట్టి మెగా ఫ్యామిలీలో సంతోషాలను రెట్టింపు చేసిన విషయం కూడా అందరికి తెలిసిందే

ఇక అసలు విషయం ఏంటంటే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ఇచ్చిన క్రేజ్ తో ఇటీవలనే ఒక వెబ్ సిరీస్ ను తలపించేలా ఒక షాపింగ్ యాప్ అడ్వేర్టైస్మెంట్ లో నటించాడు. అయితే ఈ యాడ్ హాలీవుడ్ వెబ్ సిరీస్ ను తలపించేలా ఉండటంతో అందరు ఒక్కసారిగా రామ్ చరణ్ వెబ్ సిరీస్ చేశాడా, అన్నట్టు వీడియోను ఓపెన్ చేసి చూడగా అది షాపింగ్ యాడ్ అని తెలిసి షాక్ తిన్నారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ పలువురిని ఆశ్చర్య పరుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇటీవలనే ఒక యాడ్ లో నటించిన విషయం అందరికి తెలిసిందే. ఏ మాటకమాటే ఈ యాడ్ లో రామ్ చరణ్ లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు