NKR21: కళ్యాణ్ రామ్ కొత్త సినిమా బడ్జెట్- ఈసారి బింబిసార కి మించి..

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా బింబిసార. మల్లిడి వశిష్ట్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ కొసరాజు నిర్మించిన ఈ సినిమాకు దాదాపు 40 కోట్ల వరకు ఖర్చు పెట్టారు.

బింబిసార సినిమాకు ముందు అసలు కళ్యాణ్ రామ్ కు సరైన హిట్ లేదనేది అందరికి తెలిసిందే. కళ్యాణ్ రామ్ సినిమా అంటే ఖచ్చితంగా కొత్తగా ఉంటుందని ప్రేక్షకుల్లో నమ్మకం ఉన్న, దాదాపు ఆయన సినిమాలన్నీ హాఫ్ బేక్డ్ కథలుగా ఉండటంతో కమర్షియల్ గా మాత్రం ఈ సినిమాలు పెద్దగా లాభాలు సాధించవనేది అందరికి తెలిసిన వాస్తవమే.

ఎన్ని అపజయాలు మూటగట్టుకున్న కళ్యాణ్ రామ్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. కెరీర్ అసలే అంతమాత్రంగా ఉన్న సమయంలోనే 40 కోట్ల పెట్టుబడి తన మీద తానే పెట్టుకొని బింబిసార సినిమా చేసాడు. ఒక పక్క కరోనా, మరో పక్క భారీ బడ్జెట్, కొత్త డైరెక్టర్ ఇలా అన్ని రకాల రిస్క్ లతో గతేడాది థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి, కళ్యాణ్ రామ్ కెరీర్ కు సంజీవనీలా ఉపయోగపడింది.

- Advertisement -

అయితే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మరోసారి బింబిసార లాంటి భారీ రిస్క్ చేయబోతున్నాడని టాక్. అయితే ఈసారి బింబిసార కంటే ఎక్కువ రిస్క్ ఏ తీసుకోబోతున్నాడట. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు అశోక క్రియేషన్స్ బ్యానర్ పై ఒక చిత్రం రాబోతుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు బింబిసార కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవబోతుందని టాక్. ప్రస్తుతం అమిగోస్ సినిమాతో ఫ్లాప్ లో ఉన్న కళ్యాణ్ రామ్ తొందర్లోనే డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా గనక హిట్ అయితే ఫరవాలేదు కానీ ఫ్లాప్ అయితే మాత్రం పెద్ద రిస్క్ లో పడిపోయినట్టే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు