Satyam Rajesh:పొలిమేర2 ఫస్ట్ డే కల్లెక్షన్స్.. అన్ని అంచనాలని మించిపోయింది!

టాలీవుడ్ లో ఈ వారం చిన్న సినిమాలే విడుదల కాగా, రిలీజ్ ముందు వరకు ఈ సినిమాలపై జనాలకి పెద్దగా ఆసక్తి లేదు. ముఖ్యంగా పొలిమేర2 పై సాధారణ జనాలకి పెద్దగా బజ్ లేదు. కానీ అనూహ్యంగా రిలీజ్ తర్వాత మంచి టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో దుమ్ములేపుతుంది. అప్పొసిట్ లో కీడా కోల లాంటి కామెడీ డ్రామా ఉన్నా, హర్రర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులని భయపెట్టి మెప్పించి సినిమా సూపర్ కల్లెక్షన్లని సాధించింది.

Tollywood: కామెడీ కంటే ‘A’ సర్టిఫికెట్ సినిమాకే ఎగబడుతున్న జనాలు?

రిలీజ్ అయిన ఫస్ట్ డే కేవలం తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ బుకింగ్స్ లెక్కల ప్రకారం 70 నుండి 80 లక్షల వరకు షేర్ అందుకుంటుంది అనుకోగా, అన్ని అంచనాలని మించిపోయి కోటి కి పైగా, ఆల్మోస్ట్ డబుల్ రేంజ్ లో 1.51 కోట్ల షేర్ ని సాధించింది. ఏరియా వారీగా చూస్తే..
నైజాం78L
సీడెడ్15L
ఆంధ్ర 58L

- Advertisement -

టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 1.51 కోట్లు వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 1.83 కోట్ల షేర్ ని 3.06 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక పొలిమేర2 కేవలం 3.5 కోట్ల బిజినెస్ చేయగా, 4కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అవగా ఫస్ట్ డే సాధించిన వసూళ్లు తీసేస్తే బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకా 2.17 కోట్లు కావలి.

అయితే సినిమాకి వచ్చిన టాక్ కి వసూళ్ల ఊపుని బట్టి వీకెండ్ లోనే పొలిమేర2 బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు