Sukumar: సుకుమార్ కారణంగానే ఆ యంగ్ హీరో కెరీర్ నాశనమైందా..?

సినిమా ఇండస్ట్రీలో చిత్రవిచిత్రాలు జరుగుతూనే ఉంటాయి అని అందరూ చెప్పడమే కానీ మనం కల్లారా చూసింది ఎప్పుడు లేదు. అయితే ఇలాంటి ఓ విషయం బయటపడి మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా లెక్కల మాస్టారు సుకుమార్ గురించి ఓ విషయం బయటపడి ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా సుకుమార్ పేరు ఓ రేంజ్ లో ట్రోయింగ్ కి గురవుతుంది. అదేంటంటే.. 19 ఏళ్ల క్రితం ఆర్య సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ తొలి సినిమాతోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు.

Read More: Sukumar: “పుష్ప – 2” లో రామ్ చరణ్ పాత్ర ఇదే

ఇక రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమాతో ఇండియాలోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత టాలీవుడ్ సినిమాని జాతీయస్థాయిలో నిలబెట్టాడు సుకుమార్. అలాంటి సుకుమార్ ఓ హీరో కెరీర్ నాశనం అవ్వడానికి కారణం అయ్యాడట. అదేలా అంటే.. సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాలలో 100% లవ్ సినిమా ఒకటి. ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగచైతన్య ని ఎంచుకున్నారు సుకుమార్. అయితే ఈ సినిమా చేయడానికి ముందు నాగచైతన్య కాకుండా వరుణ్ సందేశ్ ని అనుకున్నారట.

- Advertisement -

 Read More:Sukumar: మాస్ యాంగిల్ కు అద్దం పట్టేలా ఆ మూడు పాత్రలు 

ఈ సినిమా కథని కూడా ముందు వరుణ్ సందేశ్ కి చెప్పారట. ఈ సినిమా చేయడానికి వరుణ్ సందేశ్ కూడా ఓకే చెప్పారట. కానీ వరుణ్ సందేశ్ నుండి ఈ సినిమా నాగచైతన్య కి వెళ్ళింది. దీనికి కారణం కొత్త బంగారులోకం సినిమా తర్వాత ఆయన నటించిన ఏ సినిమా కూడా హిట్ కాలేదు. దీంతో వరుణ్ సందేశ్ ఫామ్ లో లేరని.. అప్పుడే ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా పెట్టి సినిమా చేస్తే సినిమా హిట్ అవుతుందని సుకుమార్ భావించారట. ఈ విషయాన్ని కనీసం వరుణ్ సందేశ్ కి చెప్పనేలేదట. ఇలా సుకుమార్ తీసుకున్న ఆ నిర్ణయం వల్ల వరుణ్ కెరీర్ నాశనమైందంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ ఈ సినిమా కనుక వరుణ్ సందేశ్ చేసి ఉంటే ఈ చిత్రం తర్వాత ఆయనకు మరికొన్ని అవకాశాలు వచ్చి ఉండేవని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు