Keedaa Cola Movie: అందులో తరుణ్ భాస్కర్ ఫెయిల్?

ఆర్టిస్ట్‌ల నుంచి సినిమాకు కావాల్సిన యాక్టింగ్ ఎలా బయటికి తీసుకురావాలో డైరెక్టర్ల బాగా తెలిసి ఉండాలి. అందులో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం ఒక అడుగు ముందే ఉంటాడు. ఇది పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది? సినిమాలు చూసిన వాళ్లకి తెలిసిపోతుంది. ఇప్పుడు కీడా కోలా మూవీలో కూడా తరుణ్ మార్క్ కనిపిస్తుందని అందరూ అనుకున్నారు.

read More: Ee Nagaraniki Emaindi: రీరిలీజ్ కి ఈ రేంజ్ కలెక్షన్స్ ఎలా సాధ్యం..!

కానీ, మూవీలో కొన్ని కామెడీ సీన్స్ మాత్రమే వర్కట్ అయ్యాయి. చాలా వరకు ప్రేక్షకుడి సహానానికి పరీక్ష పెట్టేలానే ఉన్నాయనేది ఒప్పుకోవాల్సిన నిజం. అందుకే సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. మరొ పక్క పొలిమేర2 కు పాజిటివ్ టాక్ రావడంతో, ప్రేక్షకులు ఫస్ట్ ఆప్షన్ పొలిమేర2కే ఉంటుంది. ఇదింత పక్కన పెడితే, తరుణ్ భాస్కర్ డైరెక్షన్ పై కొంత వరకు నెగిటివ్ టాక్ వస్తుంది.

- Advertisement -

read More:Keedaa Cola: కీడా కోలా బ్రేకీవెన్ ఎంతంటే..!

పాత్రల నుంచి కామెడీ పండించడంలో ఈ సారి తరుణ్ భాస్కర్ ఫెయిల్ అయ్యాడు అని అంటున్నారు క్రిటిక్స్. ముఖ్యంగా సినిమాలో వరదరాజు పాత్రలో కనిపించిన బ్రహ్మానందంను సరిగ్గా వాడుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం సినిమాలు చేయడం లేదు. కానీ ఏదైనా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే.. ఆ డైరెక్టర్ బ్రహ్మీ నుంచి సినిమాకు కావాల్సినంత పిండుకుంటున్నారు. అలా బ్రహ్మీని తరుణ్ సరిగ్గా వాడుకుంటే, డివైడ్ టాక్, కాదు.. హిట్ టాక్ వచ్చేది.

బ్రహ్రానందంకు ఎంత ఏజ్ ఉన్నా… ఆయన కామెడీ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఆయన నుంచి కామెడీ చూడటానికి ఆడియన్స్ కూడా అంతే ఇంట్రెస్ట్ తో ఉన్నారు. కానీ, డైరెక్టర్లు సరిగ్గా వాడుకోవడంలో విఫలం అవుతున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు