Sukumar: “పుష్ప – 2” లో రామ్ చరణ్ పాత్ర ఇదే

పుష్ప ది రైజ్.. గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు అల్లు అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప ది రూల్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ గెటప్ లో కనిపించి నట విశ్వరూపంతో మెప్పించారు. ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులే పుష్ప -2 సినిమా కోసం తెగ ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ ఇంకా సెక్స్ పైకి వెళ్లలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

అదేంటంటే.. పుష్ప- 2 లో రామ్ చరణ్ కనిపించబోతున్నారని. ఈ సినిమా కోసం సుకుమార్ అదిరిపోయే యాక్షన్ సీన్స్, ట్విస్టులు రాసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పుష్ప ది రూల్ క్లైమాక్స్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ – పుష్ప తో ఓ ఫైట్ సీన్ ని క్రియేట్ చేశారట. ఆ తర్వాత రామ్ చరణ్ పాత్రను హైలైట్ చేస్తూ పుష్ప 3వ పార్ట్ ని ప్లాన్ చేయబోతున్నారు అంటూ ఫిలింనగర్ వర్గాల్లో ఈ విషయం జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి ఎవడు అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు