Parineeti Chopra: సౌత్ లో ఒక ఛాన్స్ కావాలి

ప్రస్తుతం ఎక్కడ చూసినా సౌత్ సినిమా గురించే చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. సౌత్ నుంచి వచ్చిన బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, తాజాగా కాంతార వంటి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో అందరి చూపు సౌత్ పై పడింది. ముఖ్యంగా బాలీవుడ్ నటీ నటులు సౌత్ సినిమాల్లో కనిపించాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్స్, నటులు
సౌత్ సినిమాలో కనిపించి, ఇక్కడి ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు.

తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ సౌత్ సినిమాలపై ఉన్న ఇష్టాన్ని చెప్పింది. ఈ హార్యాన బ్యూటీ లేడీస్ vs రికీ బహ్ల్ సినిమాతో బాలీవుడ్ తెరపై కనిపించింది. తర్వాత ఇషాక్జాదే తో తొలిసారి హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో గుర్తింపు పొందిన హీరోయిన్ గా ఉంది. ఈ భామ ప్రస్తుతం క్యాప్సూల్ గిల్ అనే చిత్రంలో నటిస్తుంది.

ఇది ఇలా ఉండగా పరిణితి చోప్రా ఢిల్లీలో అజెండా ఆజ్ తక్ అనే కార్యక్రమానికి హజరైంది. అక్కడ సౌత్ సినిమా ఇండస్ట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ”నేను సౌత్ లో నటించడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాష ఏదైనా నేను సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక అద్భుతమైన స్క్రిప్ట్, ఒక మంచి దర్శకుడు ఉంటే గొప్ప సినిమా వస్తుంది. అలాంటి సినిమాలో నేను నటించాలి. అలాంటి అవకాశం నాకు రావాలి. సౌత్ లో ఎవరైనా గొప్ప దర్శకుడు ఉంటే దయచేసి నాకు చెప్పండి” అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు