Polimera 2: పొలిమేర 2 బిజినెస్ అండ్ బ్రేకీవెన్ డీటెయిల్స్..!

సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీలో రిలీజయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన పొలిమేర సినిమాకి సీక్వెల్ గా రూపొందిన పొలిమేర 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తోనే హైప్ పెంచేసిన ఈ సినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

Read More: Polimera 2: అడల్ట్ కంటెంట్ ఉందా?… డైరెక్టర్ రెస్పాన్స్ ఇదిగో..!

ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో ఉన్న ట్విస్ట్ ని సెకండ్ పార్ట్ లో రివీల్ చేస్తారా లేదా అన్న ఆసక్తి నెలకొంది. ఫస్ట్ పార్ట్ చూసిన వారు కచ్చితంగా సెకండ్ చూడాలన్న ఉత్కంఠతో ఉన్నారు. లో బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ అవ్వటం వల్ల మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమాకి ఓవరాల్ గా 3.5 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

- Advertisement -

ఈ సినిమా బ్రేకీవెన్ అవ్వాలంటే సుమారు 4 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. వినిపిస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఈ నంబర్స్ సాధించటం పెద్ద కష్టమేమి కాదని అనిపిస్తుంది. మొత్తానికి పార్ట్ 1 ద్వారా తనలో కమెడియన్ మాత్రమే కాదు మంచి నటుడు కూడా ఉన్నాడని ప్రూవ్ చేసుకున్న సత్యం రాజేష్ ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

Read More: Polimera 2: కామాక్షి భాస్కర్ల గురించి ఎవరికీ తెలియని నిజాలు… ఇండస్ట్రీలో ఇంత సర్కిల్ ఉందా?

దగ్గర్లో పెద్ద సినిమాలు రిలీజ్ కి లేవు కాబట్టి వారం రోజులకు పైగానే ఈ సినిమా హవా కొనసాగే అవకాశం ఉంది. వర్డ్ ఆఫ్ మౌత్ గనక హెల్ప్ అయితే ఈ సినిమా మరొక కాంతార రేంజ్ బ్లాక్ బస్టర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద పొలిమేర ఎంత స్పీడ్ గా టార్గెట్ రీచ్ అవుతుందో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు