Polimera 2: అడల్ట్ కంటెంట్ ఉందా?… డైరెక్టర్ రెస్పాన్స్ ఇదిగో..!

తెలుగు ఆడియన్స్‌కి చిన్న సినిమా… పెద్ద సినిమా అని సంబంధం లేదు. కంటెంట్ నచ్చిందా.. అంతే హిట్ చేసేస్తారు. ఇది ఈ మధ్య కాలంలో చాలా సార్లు జరిగింది. అదే ధైర్యంతో పొలిమేర 2ను థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. పొలిమేర 1 చిన్న సినిమాగా, డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. కానీ, ఆ సినిమాకు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి పార్ట్ 2 చేసి, ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

పొలిమేర చూసిన ప్రతి ఒక్కరికి ఓ డౌట్ అయితే వస్తుంది. పొలిమేర సినిమాలో అడల్ట్ కంటెంట్ కావాల్సినంత ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ దాన్ని చూడలేరు. అందుకే థియేటర్స్ కాకుండా, అప్పుడు ఓటీటీకి ఇచ్చారు. అయితే ఇప్పుడు పొలిమేర 2ను థియేటర్స్ లో రిలీజ్ చేయడం వల్ల ఈ డౌట్ వస్తుంది. ఇంతకీ ఆ డౌట్ ఏంటంటే…? పొలిమేర లాగే.. పొలిమేర2లో అడల్ట్ కంటెంట్ ఉంటుందా? దీనికి సమాధానం ఉంటుంది అనే చెప్పొచ్చు.

ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ వెల్లడించారట. తన సన్నిహిత వర్గాల వద్ద నుంచి కూడా పొలిమేర 2లో అడల్ట్ కంటెంట్ ఉంటుందా? అనే డౌట్ వచ్చిందట. దీనికి ఆయన… పొలిమేర పార్ట్ 1 కంటే… పొలిమేర 2లో ఎక్కువ అడల్ట్ కంటెంట్ ఉంటుందని చెప్పారట. అంతే కాదు. కొన్ని బుతులు కూడా ఉంటాయని, అయితే వాటిని సెన్సార్ నిబంధన ప్రకారం.. మ్యూట్ పెట్టాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారట.

- Advertisement -

అడల్ట్ కంటెంట్, బుతులు తొలగిస్తే.. సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారట. కానీ, అడల్ట్ కంటెంట్ తొలగిస్తే.. సినిమా మొత్తం మారిపోతుంది అని, స్టోరీ వీక్ అవుతుంది అనే ఉద్ధేశ్యంతో A సర్టిఫికేట్ వచ్చినా పర్లేదని అనుకున్నారట. దీంతో థియేటర్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ పొలిమేర2 తో కొంత వరకు ఇబ్బంది పడుతారని అనుకొవచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు