Satyam Rajesh: పొలిమేరకి పదింతలు? పది నిమిషాలకో ట్విస్ట్..

టాలీవుడ్ లో దసరా హడావిడి అయిపోయిన తర్వాత ఈ వారం రిలీజ్ అవుతున్న క్రేజీ సినిమాల్లో పొలిమేర2 ఒకటి. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పొలిమేర సినిమాకి రెండో పార్ట్ గా ఈ సినిమా తెరకెక్కింది. సత్యం రాజేష్ మెయిన్ లీడ్ గా నటించిన ఈ సినిమా ఓటిటి లో బ్లాక్ బస్టర్ అయింది. చేతబడుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని విశేషంగా అలరించింది.

అయితే ఫస్ట్ పార్ట్ ఓటిటి లో రావడం వల్ల ఆడియన్స్ థియేటర్లలో చూడలేదు. పైగా ఏ సెర్టిఫికెట్ సినిమా కావడం వల్ల టీవీ లో కూడా టెలికాస్ట్ కాలేదు. అయితే ఓటిటి లో ఆడియన్స్ విపరీతంగా చూసి బ్లాక్ బస్టర్ చేసారు. అందుకే పొలిమేర 2 ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసారు.

ఇక పొలిమేర ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పొలిమేర సినిమాని చాలా కష్టపడి రియలిస్టిక్ గా తీర్చిదిద్దామని, సినిమాకి సెట్టింగ్స్ కూడా వేయకుండా నిజంగా సమాధుల పక్కన తీశామని అన్నారు.

- Advertisement -

ఇక పొలిమేర సినిమాలో ప్రతి పది నిమిషాలకో ట్విస్ట్ ఉంటుందిట. అలా సినిమాలో 8 ట్విస్టులుంటాయని, క్లైమాక్స్ లో పొలిమేర 3 హింట్ కూడా ఇస్తానని డైరెక్టర్ అనిల్ విశ్వనాధ్ చెప్పాడు. పొలిమేర లో ఒక్కో ట్విస్ట్ వచ్చినప్పుడల్లా ఆడియన్స్ ని సీట్లో కూర్చోనివ్వకుండా చేస్తుందన్నారు చిత్ర యూనిట్. మరి మేకర్స్ ఇంత నమ్మకంగా చెపుతున్నారంటే పొలిమేర2 థియేటర్లలో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు