Srimathi Kumari: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిత్యామీనన్..!

తెలుగు తెరకి పరిచయమై ఇక్కడ రాణించిన బెంగుళూరు బ్యూటీలలో నిత్యామీనన్ ఒకరు. ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ వర్సటైల్ యాక్ట్రెస్ హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్కిన్ షో చేయకుండా స్టార్ డం సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో ఈమె ఒకరు. సాయి పల్లవి కంటే ముందుగా ఇక్కడ నటన పరంగా వినిపించిన పేరు నిత్యామీననే.

అలా మొదలైంది సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్, గీతా గోవిందం, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో పాటు తమిళ్, మలయాళంలో కూడా పలు సినిమాలలో నటించింది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు రకాల వెబ్ సిరీస్ లలో నటిస్తూ అలరిస్తోంది. అయితే తాజాగా నిత్యామీనన్ నటించిన “మాస్టర్ పీస్” అనే వెబ్ సిరీస్ లో నిత్య ఓ గృహిణి పాత్రలో నటించింది.

ఈ సిరీస్ లో రీల్ లైఫ్ లో గృహిణిగా ఆకట్టుకున్న నిత్యామీనన్ తనకు ఎలాంటి భర్త కావాలనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చింది. తాను పక్కా ట్రెడిషనల్ అని చెప్పుకొచ్చింది. మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తానని.. పెళ్లి విషయంలో తనకు ఓ అభిప్రాయం ఉందని తెలిపింది. పెళ్లి అనేది సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడిన సెటప్ అని తెలిపింది. అయితే తనకు మాత్రం అలాంటి సెక్యూరిటీ లేదని.. అంతకుమించి ఆలోచించే వాళ్ళు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో నిత్యామీనన్ పెళ్లి వార్త హల్చల్ చేస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు