Nitya Menon: ‘సిరి’ గా, కుమారి శ్రీమతిగా మన ముందుకొస్తుంది!

Nitya Menon:

టాలీవుడ్ లో గ్లామర్ పరంగా కాకుండా, నటనకు ప్రాధాన్యమిచ్చే అతి తక్కువ మంది హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. సౌత్ లాంగ్వేజ్స్ అన్నిటిలోనూ నటించిన ఈ అమ్మాయి తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. లాస్ట్ ఇయర్ భీమ్లా నాయక్, స్కై ల్యాబ్ చిత్రాల్లో నటించిన ఈ భామ ఈ ఇయర్ ఇంకా బోణి కొట్టలేదు. రెండు సినిమాల్లో నటిస్తున్నా అవి రిలీజ్ కావడానికి ఇంకా టైం ఉంది. అందుకే ఈ లోపు ఒక వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వస్తుంది.

‘కుమారి శ్రీమతి’ అనే పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో తనే మెయిన్ లీడ్ గా నటించగా, తాజాగా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ని గమనించగా, ఒక సాధారణ మిడ్డిల్ క్లాస్ అమ్మాయిగా నిత్యా మీనన్ నటించిందని తెలుస్తుంది. తండ్రి లేని ఇంటికి అన్ని తానై ఉండి, నడిపిస్తున్న ఈ అమ్మాయికి అమ్మ దగ్గరి నుండి, బంధువుల వరకు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చే సీన్ ఇందులో చూపించారు. అయితే కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తూనే ఉంది.

- Advertisement -

టీజర్ ని చూసాక ఫ్రెష్ ఫీలింగ్ కలుగగా, కెమరా వర్క్ నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఈ వెబ్ సిరీస్ కి గోమ్ టేష్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహించగా, వైజయంతి మూవీ బ్యానర్ లో ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించారు. కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ కి నటుడు దర్శకుడు అయిన అవసరాల శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసాడు. నీరూపమ్ పరిటాల, తిరువీర్, గౌతమి, ప్రేమ్ సాగర్, ప్రణీత పట్నాయక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా, వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ని మాత్రం చెప్పలేదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు