Devil: మాయే చేసి మెల్లగా… ఎక్కేస్తుంది మెల్లగా..!

Devil:

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “డెవిల్”. 19240స్ బ్యాక్ డ్రాప్ లో గూఢచారి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో డెవిల్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక బ్రిటిష్ ఏజెంట్ గా నటిస్తున్నాడు. అయితే ఆ రోల్ నెగిటివ్ రోల్ అని సమాచారం. డెవిల్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇంకా టీజర్ సినిమాపై అంచనాలని పెంచేయగా, తాజాగా లిరికల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.

మాయే చేసి మెల్లగా.. అంటూ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ సత్య R.V రాయగా, మెలోడీ కింగ్ సిద్ధ్ శ్రీరామ్ పాడడం జరిగింది. హీరోయిన్ గా నటించిన సంయుక్త మీనన్ ఈ పాటలో చీరకట్టులో ఉండి ఆకట్టుకుంది. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ సంయుక్త మీనన్ రెండో సారి జతకట్టడం విశేషం. పాట వినడానికి ఎంతో వినసొంపుగా ఉండడమే గాక, లిరిక్స్ కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ఇక ఈ పాటలో చూపించిన విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సౌందర్య రాజన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ నామ నిర్మించారు.

ఇటీవల డైరెక్టర్ తో విభేదాల కారణంగా అభిషేక్ నామ డైరెక్టర్ పేరు తీసేయడం జరిగింది. అయితే డెవిల్ సినిమాని నవంబర్ 24న రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు