Samyuktha menon : ఆ హీరో తో మరోసారి !

సంయుక్త మీనన్ తెలుగు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుండంతో టాలీవుడ్ కి ఈ బ్యూటీ గోల్డెన్ లెగ్ గా మారింది. పుట్టింది కేరళలో అయిన చూడటానికి పదహారణాల తెలుగు అమ్మాయిలాగా కనిపించే ఈ ముద్దు గుమ్మ వరుస తెలుగు చేస్తూ వస్తోంది.

“భీమ్లా నాయక్” సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంయుక్త కొద్దీ రోజుల్లోనే తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాకుండా చేసింది, తక్కువ సినిమాలే అయిన ఇప్పటికే తెలుగు కూడా నేర్చుకుని తన సినిమాలకి తానే డబ్బింగ్ కూడా చెప్తుంది. భీమ్లా నాయక్ సినిమా తరువాత సంయుక్త “బింబిసారా” సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించటంతో ధనుష్ తో “సార్ “ సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. కట్ చేస్తే సార్ మూవీ 100కోట్లు గ్రాస్ ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇలా చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవడంతో సంయుక్త ఉంటె సినిమా హిట్టే అనే సెంటిమెంట్ కి వచ్చేసారు మన తెలుగు ప్రొడ్యూసర్స్ .

సంయుక్త ప్రస్తుతం “విరూపాక్ష “అనే సినిమా చేస్తుంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ఈ నెల 21 న విడుదల అవబోతుంది . అయితే ఈ సినిమా విడుదల అవకముందే మరో సినిమా షూటింగ్ ని కూడా కంప్లిట్ చేసేసుకుంది ఈ కేరళ కుట్టి.

- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తోన్న చిత్రం “డెవిల్ “. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈ మధ్యనే కంప్లిట్ అయింది. “బింబిసారా “ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సంయుక్త , కళ్యాణ్ రామ్ కాంబో లో  వస్తోంది ఈ సినిమా. నవీన్ మేడారం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అమిగోస్ సినిమా నీరాశపడటం తో కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా ని చాలా సీరియస్ తీసుకొని చేస్తున్నారు . మరి ఈ సినిమా రిసల్ట్ ఎలా ఉంటబోతుందో చూడాలి

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు