Chiranjeevi: భోళా శంకర్ లేటెస్ట్ అప్ డేట్. అవేమి ఉండవట

మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత నటిస్తున్న కొత్త చిత్రం భోళా శంకర్. ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ అయిన వేదాళం మూవీ రీమేక్ గా తెరకెక్కుతుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలిగా నటిస్తుంది. 2021 లోనే స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ చిరంజీవి పాత సినిమాల పెండింగ్ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది.

అయితే ఈ సినిమా ను టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ అయిన మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే మెహర్ రమేష్ కి గత 14 ఏళ్లుగా హిట్ లేదు. 2009 లో వచ్చిన బిల్లా మూవీ తో యావరేజ్ హిట్ ని అందుకోగా ఆ తర్వాత వచ్చిన శక్తి, షాడో సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. తిరిగి 10 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ తో మూవీ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే మెహర్ రమేష్ చిరంజీవికి దూరపు బంధువు కావడం వల్ల కూడా ఈ అవకాశం వచ్చింది అనుకోవచ్చు.

భోళాశంకర్ షూటింగ్ ఇప్పటివరకు 80 శాతం పూర్తి అయింది. అయితే ఇంకా ఈ సినిమా కి నెల రోజుల షూటింగ్ బాకీ ఉందని చిత్ర యూనిట్ నుంచి సమాచారం అందింది. సినిమా యూనిట్ నుండి వచ్చిన మరొక సమాచారం ఏంటి అంటే ఈ సినిమా లో స్పెషల్ సాంగ్ గాని, లేదా ఐటెం సాంగ్ గాని ఏమి ఉండదని వెల్లడించారు. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన సినిమాల్లో సైరా మినహా అన్నింట్లోనూ స్పెషల్ సాంగ్ లు ఉన్నాయి. మరి ఈ సినిమా లో ఎందుకు పెట్టట్లేదో తెలియదు. బహుశా సినిమాకి అవసరం లేదో, లేదా షూటింగ్ కి టైం లేదో మరి.

- Advertisement -

అయితే ఈ సినిమాను AK ఎంటర్టైన్మెంట్స్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆగస్ట్ 11 న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు