Suhas : “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ల్యాండ్ అయింది.

టాలెంట్ ఉంటే చాలు ఎలాంటి ఫామిలీ బాక్గ్రౌండ్ అవసరం లేదు , అని ప్రూవ్ చేసాడు మన ఛాయ్ బిస్కెట్ సుహాస్. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించి ఇప్పుడు సినిమాలు చేసే స్థాయి దాక వెళ్ళాడు. సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్ లు చేసుకుంటూ “కలర్ ఫోటో ” సినిమాతో కథానాయకుడిగా మారిపోయాడు మన సుహాస్.

అయితే కలర్ ఫోటో సినిమా లొక్డౌన్ కారణంగా ఓటిటి లో రిలీజ్ చేసారు. మంచి సినిమాకి అడ్డు ఏముంటది అనే తరహాలో ఓటిటి లో రిలీజ్ అయినప్పటికీ “కలర్ ఫోటో “సినిమా మంచి విజయాన్ని సాధించి, నేషనల్ అవార్డు గెలుచుకుంది. కాగా సుహాస్ హీరోగా, ఛాయ్ బిస్కెట్స్ అనురాగ్, శరత్ ప్రొడ్యూసర్స్ గా చేస్తూ ఈ మధ్యనే రైటర్ పద్మభూషణ్ సినిమాని రిలీజ్ చేసారు. ఎమోషన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో ఘన విజయం సాధించింది.

అయితే ప్రస్తుతం సుహాస్ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” అనే సినిమాలో నటిస్తున్నారు. జిఎ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ సినిమాని సమర్పిస్తున్నారు. దుశ్యంత్ కటికనేని ఈ సినిమా తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మల్లి కార్జున సెలూన్ షాప్ ముందు నిల్చొని బ్యాండ్ పట్టుకొని ఉన్న సుహాస్ అండ్ గ్యాంగ్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు.

- Advertisement -

అంబాజీ పేట మ్యారేజి బ్యాండు సినిమా నాకు చాల ప్రత్యేకం , మంచి సినిమాలు తీయాలనే ఆలోచన ఉన్న నా ఫ్రెండ్స్ డైరెక్టర్ లు అవుతూ నన్ను డైరెక్ట్ చేయడం చాలా ఆనందం గా ఉంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన జిఎ2 బ్యానర్ లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది అని చెప్తూ సుహాస్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని పోస్ట్ చేసారు. తూర్పు గోదావరి జిల్లా పల్లెటూరి నేపథ్యంలో సినిమా ఉండబోతుంది అని పోస్టర్ ద్వారా తెలుస్తుంది. “పుష్ప” సినిమా ఫెమ్ జగదీశ్ ప్రతాప్ బండారి ఈ సినిమాలో సుహాస్ అంబాజీపేట గ్యాంగ్ లో ఒకడిగా నటిస్తున్నాడు .

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు