Sri Simha: రానా చేతుల మీదుగా విడుదలైన ఉస్తాద్ టీజర్

లెజెండరీ సంగీత కీరవాణి కొడుకు శ్రీ సింహ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో “మత్తు వదలరా” అనే చిత్రంతో హీరోగా పరిచమయ్యాడు. కీరవాణి కొడుకు అయినప్పటికీ నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే హీరో కాక ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాజమౌళి తీసిన విక్రమార్కుడు, ఛత్రపతి, యమ దొంగ మూవీస్ లో నటించాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా రాజమౌళి దగ్గర కొన్ని సినిమాలకు పని చేసిన శ్రీ సింహ, 2019 లో రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన “మత్తు వదలరా” చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత “తెల్లవారితే గురువారం” , “దొంగలున్నారు జాగ్రత్తా “మూవీస్ లో హీరోగా చేశాడు. ఎప్పుడూ కొత్త తరహా సినిమాలతో వచ్చే శ్రీ సింహ ఈసారి కూడా ఒక మంచి కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ఉస్తాద్ అనే ఒక సీరియస్ డ్రామా మూవీ తో రాబోతున్నాడు.

తాజాగా ఉస్తాద్ సినిమా యొక్క ఆఫీషియల్ టీజర్ ని ఈరోజు (ఏప్రిల్ 12) ఉదయం 7.36 గంటలకు రానా చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఒక నిమిషం 17 సెకెన్ల నిడివి గల ఈ టీజర్ లో శ్రీ సింహ గత చిత్రాల కంటే చాలా కొత్తగా కనిపించాడు. ఈ టీజర్ లో ఒక పైలెట్ కావాలనే డ్రీం ఉన్న యువకుడిగా హీరో కనిపించాడు. ఈ సినిమాలో హీరోకి ఎత్తైన వాటి పైకి వెళ్తే కళ్ళు తిరుగుతాయి. మరి ఆ సమస్యని అధిగమించి హీరో ఎలా ముందుకెళ్తాడు అని ఈ టీజర్ లో చూడొచ్చు. ప్రొడక్షన్ వాల్యూ బాగుంది. టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.

- Advertisement -

వారాహి చలన చిత్రం బ్యానర్ పై ఉస్తాద్ సినిమాను నిర్మిస్తుండగా ఈ సినిమాకి ఫణిదీప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. డైరెక్టర్ కం యాక్టర్ గౌతమ్ మీనన్ ఈ మూవీ లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా, శివ తేజ, సాయి కిరణ్ యేడిద, సత్య తదితరులు ఈ సినిమాల్లో నటించారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు