Tollywood: ప్రభాస్ వల్ల రాజమౌళిని తిడుతున్న డైరెక్టర్స్..! ఎందుకంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అంత పెద్ద స్టార్ అయిన ప్రభాస్ జనం ముందు ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడడానికి చాలా మొహమాటపడుతుంటారట. ఎక్కువగా ఎవరి ఫంక్షన్స్ కి రారు. తన ప్రీ రిలీజ్ వేడుకలలోనూ ఆయన ఎక్కువ సేపు మాట్లాడరు.

అయితే ప్రభాస్ కి ఉన్న ఈ మొహమాటం వల్ల ఓసారి దర్శక ధీరుడు రాజమౌళి తిట్లు తినాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ షోలో పాల్గొన్న ప్రభాస్ స్వయంగా వెల్లడించారు. ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్ లో చత్రపతి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుందట. చత్రపతి సినిమాలో ఇంటర్వెల్ సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా విలన్ ని చంపిన తరువాత కోటా శ్రీనివాసరావుకి ప్రభాస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి బయటకి వచ్చిన తరువాత జనాలను ఉద్దేశించి డైలాగ్ చెప్పాలి. ఆ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో ఓవైపు వర్షం, మరోవైపు చలితో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ జనం కనిపించేసరికి డైలాగ్ చెప్పలేకపోయారట. అక్కడే ఉన్న డైరెక్టర్ రాజమౌళిని పిలిచి “నేను డైలాగ్ గట్టిగా చెప్పలేను.. సైలెంట్ గా చెబుతా.. ప్లీజ్..” అన్నారట. దీనికి రాజమౌళి కూడా ఒప్పుకోవడంతో హై పిచ్ లో డైలాగ్ చెప్పాల్సిన ప్రభాస్ చిన్నగా చెబుతూ షాట్ పూర్తి చేశాడట. అప్పుడు రాజమౌళి ఆకస్మాత్తుగా “షాట్ ఓకే” అనగానే అప్పటివరకు అది రిహార్సల్స్ అనుకున్న వారందరూ ఆశ్చర్యపోయారట.

ఇక మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్ షూటింగ్ సమయంలోను ప్రభాస్ పెద్దగా డైలాగ్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోవడంతో అక్కడే ఉన్న దర్శకుడు కె విశ్వనాథ్ పిలిచి.. ” ఇలాగైతే ఎలాగయ్యా.. ఓపెన్ గా డైలాగ్ చెప్పాలి, సిగ్గుపడితే ఎలా..?” అని అన్నారట. అప్పుడు సరే అన్న ప్రభాస్ మళ్లీ యధావిధిగా డైలాగ్ చెప్పడానికి సిగ్గుపడ్డారట. ఇక అప్పటినుండి ప్రభాస్ తో పనిచేసే దర్శకులు అందరూ రాజమౌళిని తిట్టుకోవడం ప్రారంభించారట. రాజమౌళి అలవాటు చేయడం వల్లే ప్రభాస్ డైలాగులు ఇలా స్లో గా చెబుతున్నారు అనేవారట. ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 5 పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు