N75: సూపర్ స్టార్ ఆశీస్సులతో లేడీ సూపర్ స్టార్ మూవీ ఓపెనింగ్

లేడీ సూపర్ స్టార్ నయనతార. సౌత్ ఇండియా లో ఈ పేరు తెలియని ప్రేక్షకుడు లేడు. ఒక చిన్న మలయాళం మూవీ లో సైడ్ రోల్ తో కెరీర్ ప్రారంభించిన ఈ నటి సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన చంద్రముఖి సినిమా లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు లో వెంకటేష్ లక్ష్మి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఇటు తెలుగులోనూ ఫస్ట్ మూవీ తోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత గజినీ, వల్లభ , తెలుగులో దుబాయ్ శీను, తులసి, సింహా లాంటి హిట్ల తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత అనామిక సినిమా తో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మాయ, డోరా, కర్తవ్యం, పెద్దమ్మ తల్లి మూవీస్ లో నటించింది. తెలుగు లో చివరగా గాడ్ ఫాదర్ లో నటించింది.

ప్రస్తుతం హిందీ జవాన్ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాలు చేస్తుంది. తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తాజాగా నయనతార తన కెరీర్లో ఒక మైల్ స్టోన్ కి రీచ్ అయింది. నయన్ ఇప్పటివరకు 74 సినిమాల్లో నటించింది. తాజాగా నయనతార మెయిన్ లీడ్ గా తన 75th మూవీ ఓపెనింగ్ ని జరుపుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాను నీలేష్ కృష్ణ అనే తమిళ డైరెక్టర్  తెరకెక్కిస్తున్నాడు. జీ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటుంది. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ని అందిస్తున్నాడు.

ఇక తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ ఏప్రిల్ 9 న ఓపెనింగ్ జరుపుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాకు తన విషెస్ తెలియచేసారు. క్లాప్ బోర్డు పైన ఆయన ముహూర్తం అని రాసి వాళ్ళకి తన స్పెషల్ విషెస్ ని చెప్పాడు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఓపెనింగ్ కు వెళ్లని రజినీకాంత్ ఈ సినిమా కు విష్ చేయడం విశేషం. ఇక లేడీ ఓరియంటెడ్ మూవీగా, నయన తార 75 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ హీరో జై, సత్య రాజ్, రెడిన్ కింగ్స్లే ,కే.ఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి, అచ్యుత్ కుమార్, రేణుక, పూర్ణ చక్రవర్తి, కార్తీక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు