Rajnikanth : “లాల్ సలాం”సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్

రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ “లాల్ సలాం”అనే సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా మట్టి కుస్తీ మూవీ ఫెమ్ విష్ణు విశాల్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. రజినీకాంత్ ఈ సినిమా లో స్పెషల్ అప్పీరెన్స్ గా కనిపించనున్నారు.

ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ కి రీసెంట్ గానే డైవర్స్ అయినా విషయం తెలిసిందే. అయితే డైవర్స్ అయిన తరువాత నుంచి ఆమె సినిమా పనుల్లో బిజీ అయ్యారు , గతంలో ఐశ్వర్య ధనుష్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ” 3 “అనే సినిమాకి దర్శకత్వం వహించింది. ఈ సినిమా తమిళ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు కూడా ఈ సినిమా మంచి వసూళ్ళని రాబట్టింది. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే శృతి హాసన్ కి, ధనుష్ కి అఫైర్ నడుస్తుంది అని చాలా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచే ధనుష్ కి , ఐశ్వర్యకి గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు కాస్త పెరిగి పెరిగి డైవర్స్ దాక వెళ్లాయి. జనవరి ,2022 లో ఈ ఇద్దరు అఫిషల్ గా డైవర్స్ తీసుకున్నారు.

డైవర్స్ అయిన దగ్గర నుండి కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన ఐశ్వర్య. లాల్ సలాం అనే సినిమాతో మళ్ళీ డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కి సంబంధించి 34 రోజుల లాంగ్ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ పూర్తి చేసుకున్నారు. పాండిచ్చేరి లో జరిగిన ఈ షెడ్యూల్ సినిమాకె హైలెట్ గా ఉంబోతుందట. ఈ సినిమాలో రజినీకాంత్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆయన నెల్సన్ దర్శకత్వం లో జైలర్ సినిమాలో నటిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు