LGM: లవ్ టుడే హీరోయిన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

ఇవానా. ఈ పేరు చెప్తే తెలుగు వాళ్ళు పెద్దగా గుర్తు పట్టక పోవచ్చుగాని, లవ్ టుడే హీరోయిన్ అంటే మాత్రం చాలా ఈజీ గా గుర్తు పడతారు. ఆ సినిమా తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. కేరళలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ 2012 లో మలయాళం, తమిళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత మెల్లిగా హీరోయిన్ గా మారింది. 2018 లో నాచియర్ సినిమా లో కీలక పాత్రలో నటించగా, 2022 లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తీసిన లవ్ టుడే సినిమా ద్వారా హీరొయిన్ గా ఆఫీషియల్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాదాపు 100 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ “ఇవానా” కి ఒక్క సినిమా తోనే మంచి గుర్తింపు వచ్చింది.

అయితే లేటెస్ట్ గా ఇవానా హీరోయిన్ గా నటించిన కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఒకటి రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు “LGM”. ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ సినిమా ను నిర్మిస్తున్న వారు ఇండియన్ గ్రేటెస్ట్ క్రికెట్ కెప్టెన్, ప్లేయర్ అయిన మహేంద్ర సింగ్ ధోని. రీసెంట్ ఆయన ప్రొడ్యూసర్ గా మారారు. ‘ధోని ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో ఇదే తొలి సినిమా. ధోని భార్య సాక్షి సింగ్ ఈ నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి చూస్తున్నారు.

- Advertisement -

రమేష్ తమిళ్ మణి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. హరీష్ కళ్యాణ్ హీరో గా నటించగా , ఇవానా హీరోయిన్ గా నటించింది. ఇంకా నదియా, యోగి బాబు, rj విజయ్, విశ్వజిత్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. 2023 ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల చేస్తారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates,Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు