Surya: ఈసారైనా సూర్య హిట్ కొడతాడా..?

కోలీవుడ్ హీరో సూర్యకు తమిళనాట కంటే తెలుగురాష్ట్రాల్లోనే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందని అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా ఏ క్యారెక్టర్ అయినా సునాయాసంగా పండించగల పొటెన్షియాలిటీ ఉన్న హీరో సూర్య. గజినీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, యముడు వంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకు తనలోని ప్రతిభకు తగిన హిట్ ఇప్పటికి లేదనే చెప్పాలి. సెవెంత్ సెన్స్, 24వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో సూర్య తన నటనతో మెప్పించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాయి. ఈ క్రమంలో శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమాకు సంబందించిన టైటిల్ అనౌన్సమెంట్ పోస్టర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది.

వారియర్ గెటప్ లో గుర్రంపై ఒక కొండా అంచున సూర్య, పక్కనే వేట కుక్కతో ఉన్న ఆ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. ఈ నెల 16న ఉదయం 9:05 నిమిషాలకు టైటిల్ అనౌన్స్మెంట్ ఉండనుంది అంటూ సినిమా యూనిట్ పోస్టర్ ద్వారా తెలిపింది. పది భాషల్లో రూపొందబోతున్న ఈ సినిమాలో నయనతార, దిశాపటాని హీరోయిన్లుగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆకాశమే నీ హద్దురా, జైభీమ్ సినిమాలో ఓటీటీలో హిట్ కొట్టిన సూర్య గతేడాది వచ్చిన విక్రమ్ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించి థియేటర్లలో సందడి చేశారు.

లాక్డౌన్ తర్వాత సూర్య ఫుల్ లెన్త్ రోల్ నటించనున్న సినిమా కావటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు మాస్ అండ్ యాక్షన్ ఎంటెర్టైనర్లకే పరిమితం అయిన డైరెక్టర్ శివకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. టైటిల్ ఆనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే పీరియాడిక్ డ్రామా ఫీల్ ని ఇస్తున్న సినిమా కోసం డైరెక్టర్ శివ ఎలాంటి కథను సిద్ధం చేశాడు. ప్రయోగాత్మక చిత్రంతో వస్తున్న సూర్య ఈ సారైనా హిట్ కొడతాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు