Chiranjeevi : ఆ కోలీవుడ్ డైరెక్టర్ తో చిరంజీవి – కాంబో కన్ఫామ్ ఐతే అరాచకమే

Chiranjeevi

మెగా స్టార్ చిరంజీవికి భోళా శంకర్ సినిమా బాగానే బుద్ది చెప్పింది. ముందు నుంచి చిరంజీవి ఇక రీమేక్ సినిమాలు చెయ్యొద్దంటూ మెగా అభిమానులు నెత్తి నోరు పోయేటట్టు మోత్తుకున్నా, పలు భజన బ్యాచ్ మాటలు విని చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక లేటెస్ట్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటించిన రీమేక్ సినిమా భోళా శంకర్ ఇటీవలనే రిలీజై చిరు కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో చిరంజీవి ఇకనుంచి స్ట్రయిట్ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నాడు.

ప్రస్తుతం చిరంజీవి యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. గతేడాది బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మల్లిడి వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ తరువాత చిరంజీవి ఒక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

మరీ చిరంజీవి ను డైరెక్ట్ చేసే ఆ కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మరెవరో కాదు ఇటీవలనే రజినీకాంత్ తో జైలర్ సినిమా తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్. వివరాల్లోకి వెళ్తే.. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ అధినేత కే యస్ రామారావు మెగా స్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

గతంలో కే యస్ రామారావు, చిరంజీవి కలిసి అభిలాష, రాక్షసుడు వంటి సూపర్ హిట్ సినిమాలు చేసారు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి భోళా శంకర్ సినిమా చేయాల్సి ఉండిందట కానీ రామారావు కు చిరంజీవితో రీమేక్ సినిమా చేయడం ఇష్టం లేక ఆ సినిమా వదిలేసాడు.

అయితే కే యస్ రామారావు ప్రస్తుతం డైరెక్టర్ నెల్సన్ , చిరంజీవి కాంబినేషన్ లో సినిమా చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే ఈ విషయమై నెల్సన్ తో కూడా ఆయన మాట్లాడారట నెల్సన్ కూడా చిరు తో సినిమా చేయడానికి సానుకూలంగా ఉన్నాడట. ప్రస్తుతం చిరు చేతిలో ఉన్న సినిమాలు కంప్లిట్ అవ్వగానే నెల్సన్ సినిమా పట్టాలెక్కించడానికి కే యస్ రామారావు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందుతోంది. మరీ ఈ కాంబోలో సినిమా గనక కన్ఫామ్ అయితే చిరు కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమా పడినట్టే అని చెప్పాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు