Nithya Menen: ఆ హీరో నన్ను కమిట్మెంట్ అడుగుతూ… వేధించాడు

అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకి పరిచమైన హీరోయిన్ నిత్య మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమాతోనే తన నటనతో అందరిని ఆకట్టుకున్న ఈ కేరళ కుట్టి అలా మొదలైంది సినిమా తరువాత నుంచి తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయింది. దాదాపు ఇప్పుడున్న యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతోనూ వర్క్ చేసిన నిత్య మీనన్ హావ ఈమధ్య కాలంలో మాత్రం కాస్త తగ్గింది.

గతేడాది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులని అలరించిన ఈ బ్యూటీ ఇటీవల ఒక ఇంటర్యూ చేసిన అటెండ్ అయింది. అయితే ఇంటర్యూలో ఆమెని హీరోయిన్ గా నటించే మొదటి రోజుల్లో ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆమె చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ ఇంటర్యూలో ఆమె తెలుగు ,తమిళ్ ఫిలిం ఇండస్ట్రీల గురించి చెబుతూ.. కామాంధులు ఏ పరిశ్రమలోనైన ఉంటారని అలాగే సినీ పరిశ్రమలో ఉంటారని ఆమె చెప్పుకొచ్చింది. అందరి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి చెప్పినట్టు తనకెప్పుడు అలాంటి ఇబ్బంది రాలేదని చెప్తూ.. కానీ ఒక హీరో మాత్రం తనని చాలా ఇబ్బంది పెట్టేవాడిని చెప్పింది.

- Advertisement -

ప్రతి రోజు తనని రూమ్ కి రమ్మని పిలిచేవాడని, లొకేషన్ లో సీన్ చేస్తున్నప్పుడు కూడా కళ్ళతో సైగ చేసేవాడని, అతని వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఆ సినిమా షూటింగ్ తొందర తొందరగా ఫినిష్ చేసి, సినిమా కంప్లిట్ అయిన తరువాత మళ్ళీ ఆ హీరోని తానెప్పుడు కలవలేదని చెప్పింది. అలాగే ఆమె తనని ఇబ్బంది పెట్టిన ఆ హీరో ఒక తమిళ్ స్టార్ హీరో అని చెప్పింది. తెలుగులో మాత్రం తనతో పని చేసిన అందరు హీరోలు తనని చాలా బాగా చూసుకున్నారని టాలీవుడ్ లో మాత్రం తనకి ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఆమె చెప్పుకొచ్చింది

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు