Tharun Bhascker: ‘కీడా కోలా’ డే1 లెక్క ఏంటి ఇలా ఉంది?

టాలీవుడ్ టాలెంటెడ్ తరుణ్ భాస్కర్ చాలా రోజుల తర్వాత దర్శకత్వం వహించిన సినిమా “కీడా కోలా”. చైతన్య రావు హీరోగా క్రైమ్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా మిక్సడ్ రెస్పాన్స్ ని తెచ్చుకోగా, ఫస్ట్ డే అన్ని అంచనాలని మించిపోయి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. నిజం చెప్పాలంటే చాలా ఏరియాల్లో ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా తరుణ్ భాస్కర్ ఫాలోయింగ్ క్రేజ్ తో టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ అందుకుందని చెప్పొచ్చు.

అయితే కీడా కోలా తరుణ్ భాస్కర్ గత సినిమాల రేంజ్ లో లేదన్నది వాస్తవం. సినిమా టేకింగ్ పరంగా బాగున్నా, స్టోరీ పరంగా చూస్తే దెబ్బ పడినట్టు అనిపిస్తుంది.  పైగా బ్రహ్మానందం కి స్థాయికి తగ్గ రోల్ ఇవ్వలేదు. తరుణ్ భాస్కర్ కు కలిసొచ్చే కామెడీని కరెక్ట్ గా యూజ్ చేయలేదు. అయినా తరుణ్ ప్రమోషన్ ప్రతిభతో ఓపెనింగ్స్ కొట్టాడని చెప్పొచ్చు.

కీడా కోలా ఫస్ట్ డే నైజాం, ఆంధ్ర లో మామూలు ఓపెనింగ్స్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నైజాం లో 91 లక్షలు, ఆంద్రప్రదేశ్ లో 50 లక్షలు కలిపి 1.40 కోట్ల షేర్ ని సాధించింది. అలాగే ఓవర్సీస్ లో కొంత వరకు మంచి వసూళ్లు అందుకుంది.

- Advertisement -

Satyam Rajesh:పొలిమేర2 ఫస్ట్ డే కల్లెక్షన్స్.. అన్ని అంచనాలని మించిపోయింది!

ఓవర్సీస్ లో 1.45 కోట్ల షేర్ వసూళ్లు అందుకోగా, ఇది తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్ల కంటే ఎక్కువ. ఇక కీడా కోలా వరల్డ్ వైడ్ గా 2.85కోట్ల షేర్ ని 5.65 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

అయితే 8.5 కోట్ల బిజినెస్ చేసిన కీడా కోల 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయింది. ఇక ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 6కోట్ల కి పైగా రాబట్టాలి. ప్రస్తుతం డివైడ్ టాక్ తో ఉన్న కీడా కోలా… ఈ వీకెండ్ వరకు కోలుకుంటే బ్రేక్ ఈవెన్ అందుకుంటుంది. లేదంటే.. నష్టాన్ని ఎదుర్కొక తప్పదు. అయితే గతంలో ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా ఫస్ట్ వీకెండ్ తర్వాత పుంజుకుని రికార్డ్ స్థాయిలో విజయం సాధించింది. ఇప్పుడు కీడా కోలా విషయంలో అలాంటి అద్భుతం జరగుతుందో లేదా చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు