Keeda cola: ఫినిష్ అన్నారు.. మరి రిలీజ్ కి అంత లేటెందుకు?

Keeda cola:

టాలీవుడ్ లో ఈ మధ్య పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయన్న సంగతి తెలిసిందే. మొన్న వచ్చిన బలగం, నిన్న వచ్చిన బేబీ, నేడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. తాజాగా మరో చిన్న సినిమా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. అదే “కీడా కోలా” సినిమా. ఈ మూవీ పై ఇంత హైప్ రావడానికి కారణం తరుణ్ భాస్కర్. ఈ డైరెక్టర్ కమ్ ఆక్టర్ దర్శకత్వం వహించిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్సో తెలిసిందే.

ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకొని ఒక థ్రిల్లర్ కామెడీ డ్రామా ద్వారా ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. యూట్యూబ్ స్టార్ చైతన్య రావ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇక పోస్టర్స్ తో పాటు, రిలీజ్ అయిన టీజర్ తో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇప్పటివరకు చెప్పకపోగా, తాజాగా నవంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం అయిపోయిందని ఆగష్టు లోనే ప్రకటించిన చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ని అంత లాంగ్ కి తీసుకుపోవడం ఎందుకని ఫ్యాన్స్ అంటున్నారు. అంటే సినిమా షెడ్యూల్ ఇంకా చాలా బాకీ ఉందా అన్న డౌట్ వస్తుంది మూవీ లవర్స్ కి. ఏది ఏమైనా ఏది ఏమైనా కీడా కోలా సినిమా ఎప్పుడొచ్చినా తరుణ్ భాస్కర్ ఫ్యాన్స్ థియేటర్లలో కిర్రెక్కించడం ఖాయం.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు