Rajinikanth: ఈ దీపావళికి ఇంటికి రాబోతున్న జైలర్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగష్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ నాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా చాలా రోజులకు రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ కు రుచి చూపించారు.

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లు సాధించడమే కాకుండా, బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి కాసుల పంట కురిపించింది. ఇక మోహన్ లాల్, శివరాజ్ కుమార్ స్పెషల్ అప్పీరెన్స్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించకపోయినా, ఈ మూవీ హక్కులు దక్కించుకున్న సన్ టీవీ వాళ్ళు జైలర్ టీవీల్లో టెలికాస్ట్ కాబోతుందంటూ యాడ్స్ ఇచ్చేస్తున్నారు. ఇక తెలుగులో జెమినీటీవీ లో జైలర్ రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

అయితే జైలర్ రిలీజ్ డేట్ ప్రకటించకపోయినప్పటికీ రాబోతున్న పెద్ద పండగ దీపావళే కాబట్టి, ఆ రోజు జైలర్ టెలివిజన్ లో టెలికాస్ట్ కావొచ్చంటూ హింట్ ఇచ్చేసారు. ఇక ఆరోజు జైలర్ ప్రతి ఇంట్లో సందడి చేయడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు