LEO: మిక్సడ్ టాక్ తో 500 కోట్లు కొట్టేసాడు?

కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ హీరో లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో “లియో” అనే సినిమా లో నటించిన సంగతి తెలిసిందే. ఆక్షన్ థ్రిల్లర్ గా LCU లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ దసరా కానుకగా రిలీజ్ అయి మిక్సెడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. చిన్న కథని క్లియర్ గా చెప్పకుండా పొడిగించి ల్యాగ్ ఎక్కువ చేసారని ఆడియన్స్ నుండి టాక్ వచ్చింది.

అయితే విజయ్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా పిచ్చిగా నచ్చేసింది. అందుకే లియో రిపీట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ రోజునే వంద కోట్ల ఓపెనింగ్ అందుకోగా, వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపొయింది. తాజాగా లియో ఏకంగా ఐదు వందల కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపొయింది. రిలీజ్ అయిన కేవలం పది రోజుల్లోనే లియో ఈ ఫీట్ ని అందుకోవడం విశేషం. అయితే ఉన్న టాక్ పరంగా లియో లాంగ్ రన్ లో మరో యాభై నుండి అరవై కోట్ల వరకు వసూలు చేయొచ్చు.

అయితే లియో సినిమాకి ఇంత భారీ ఓపెనింగ్స్ రావడానికి మెయిన్ రీసన్ లోకేష్ కానగరాజే అని చెప్పొచ్చు. పైగా ఈ సినిమాని కూడా lcu కి లింక్ పెట్టడం లియో కలెక్షన్స్ కి పెద్ద అడ్వాంటేజ్ గా మారింది. అయితే ఈ సినిమాలో కొన్ని హింసాత్మకమైన సీన్లు పక్కన పెట్టేస్తే ఫ్యామిలీతో కూడా లియో ని ఎంచక్కా చూసేయొచ్చు.

- Advertisement -

ఇక లియో తరువాత లోకేష్ కానగరాజ్ రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడు. అయితే రజిని ప్రస్తుతం తలైవర్170 లో బిజీ గా ఉన్నాడు. మరి లోకేష్ ఆ లోపు LCU లో ఖైదీ2 ఏమైనా పట్టాలెక్కిస్తాడా లేదా అనేది చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు