Rajinikanth: ఆ దేశంలో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా జైలర్?

Rajinikanth:

బాక్స్ ఆఫీస్ వద్ద జైలర్ రికార్డుల పరంపర ఇంకా ఆగిపోలేదు. గత నెల అగస్ట్ 10న విడుదలైన ఆ సినిమా అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్ తో దుమ్ములేపింది. రజినీకాంత్ కి చాలా ఏళ్లకు సరైన కంటెంట్ పడడంతో బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చూపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ ఒక రిటైర్డ్ జైలర్ గా నటించాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు వందల కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా తమిళ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, చాలా చోట్ల అల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది.

అయితే ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, స్పెషల్ అప్పీరెన్స్ కూడా జైలర్ కి ఇన్ని కలెక్షన్లు రావడానికి ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఈ మధ్యనే పొన్నియిన్ సెల్వన్, విక్రమ్ సినిమాల రికార్డు లని దాటేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన జైలర్ ఇప్పుడు తాజాగా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.

జైలర్ సినిమా ఇప్పుడు మలేసియా లో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీ గా నిలిచింది. ఇంతకు ముందు విక్రమ్ సినిమా అక్కడ టాప్ ప్లేస్ లో ఉండగా ఆ రికార్డు ని జైలర్ బ్రేక్ చేసింది. అయితే మలేసియా లో ఎక్కువగా తమిళ్ ప్రజలే ఉంటారని తెలిసిందే. అందుకే అక్కడ ఎక్కువగా తమిళ్ సినిమాలే ఆడతాయి. రికార్డులు కూడా ఆ సినిమాలకే ఎక్కువగా వస్తాయి. ఇక రాబోయే లియో సినిమాతో ఈ రికార్డు బ్రేక్ చేయాలనీ విజయ్ ఫ్యాన్స్ ఎదురుచుస్తున్నారు. అయితే అది సినిమా కంటెంట్ పైనే డిపెండ్ అయి ఉంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు