Bigboss PowerAstra: ఇంతకీ పవర్ అస్త్ర ఎవరి దగ్గరుందో తెలుసా?

Bigboss PowerAstra:

బిగ్ బాస్ 7లో అంతా ఉల్టా పల్టా ఆట ఉంటుందని బిగినింగ్ నుండే నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆటలో జెన్యూన్ గా ఆడుతున్న వారు మాత్రం తక్కువే ఉన్నారు. పైగా కొందరు ఇంకా బిగ్ బాస్ కి హౌస్ కి అలవాటు పడలేదు. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ ఓ రెండో వారంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లను రెండు టీమ్ లుగా చేశారన్న సంగతి తెలిసిందే. అయితే అది ఒక గేమ్ కోసమేనని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఆ గేమ్ లో భాగంగా, టీం ఆడుతున్నపుడు, ఒక టీమ్ అయిన శుభశ్రీ, దామిని సందీప్ కి సొంతమైన పవర్ అస్త్ర ని దొంగిలించారు.

ఆ విషయాన్ని బిగ్ బాస్ కి తెలపగా, ఆ అస్త్రాన్ని ఎవరికీ తెలియకుండా దాచడం జరిగింది. అయితే వాళ్ళు ఎక్కడ దాచారన్న సంగతి ఈరోజు ఎపిసోడ్ లో తెలియవచ్చు. అయితే తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో శుభశ్రీ పవర్ అస్త్ర ని వేరే టీమ్ మెంబెర్ అయిన ప్రిన్స్ యావర్ దగ్గర దాచినట్టు అనిపిస్తుంది.

ఇక ప్రిన్స్ యావర్ ఇంగ్లీష్ లోనే ఎక్కువగా మాట్లాడుతున్నాడని, బిగ్ బాస్ ప్రిన్స్ యావర్ కి తెలుగులో నాన్ స్టాప్ గా చదవమని పనిష్మెంట్ ఇచ్చినట్టు ఆ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది.

- Advertisement -

అయితే ప్రిన్స్ యావర్ కి నిజంగా అందుకే ఆ పనిష్మెంట్ వచ్చిందా? అసలు పవర్ అస్త్ర ప్రిన్స్ దగ్గరే వాళ్ళు దాచారా? లేక వేరే తప్పుకు పనిష్మెంట్ ఇచ్చారా? అన్నది తెలియాలి. ఏది ఏమైనా ఆ ప్రోమో లో ప్రిన్స్ యావర్ చాలా సహనంతో ఉంటే, అదే టీమ్ మెంబెర్ అయిన శివాజీ తన తడాఖా చూపిస్తున్నాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు