Bigg Boss Season7: స్టార్ హీరోకు బిగ్ బాస్ చిక్కులు… హోస్ట్ గా ఫెయిల్ అయ్యాడా?

ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల టీవీ ప్రియులను బుల్లితెరకు కట్టిపడేసేలా చేస్తున్న షో ఏదైనా ఉంది అంటే అది ‘బిగ్ బాస్’. ఒకవైపు ఈ షోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా కూడా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ షోలో కన్పించిన వారంతా ఆ తరువాత బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గర అవుతుండడంతో బిగ్ బాస్ హౌజ్ లో కనిపించడానికి చాలామంది ప్రముఖులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

మరోవైపు ఈ షోను నిర్వహించే హోస్ట్ కు కూడా భారీగానే రెమ్యూనరేషన్ ముట్టజెపుతున్నారు. అందుకే హోస్ట్ గా అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలే కొనసాగుతున్నారు. అయితే తాజాగా ఓ భాషలోని బిగ్ బాస్ హోస్ట్ ను మాత్రం ఆ షో చిక్కుల్లో పడేసింది. ఉలగనాయగన్ కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ షోకు చాలాకాలం నుంచి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ ప్రేక్షకుల నుంచి కమల్ హాసన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

తమిళ బిగ్ బాస్ హోస్ట్‌గా ఆయన బుల్లితెర ఆడియన్స్ ను మెప్పించడంలో ఫెయిల్ అవుతున్నాడు. ఆయన విమెన్స్ సేఫ్టీ కార్డ్‌ని ఉపయోగించి కేవలం మహిళా కంటెస్టెంట్స్‌కే సపోర్ట్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండా, బిగ్ బాస్ తమిళం ప్రస్తుత సీజన్‌ బిగ్ బాస్ 7లో నెలకొన్న చాలా సిట్యుయేషన్స్ లో కమల్ తీవ్ర విమర్శలనే ఎదుర్కొన్నాడు. ఈ రకంగా ఈ సీజన్‌లో నెటిజన్ల నుండి ఆయనకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చాలా మంది హోస్ట్‌ ను మార్చాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

తాజా సీజన్ లో ఇటీవల కంటెస్టెంట్ ప్రదీప్ ను ఎలిమినేట్ చేయడం కూడా కమల్ పై వ్యతిరేకతను పెంచింది. అతడిని నేరుగా ఎదిరించలేని తోటి కంటెస్టెంట్లు, అవకాశం రాగానే రెడ్ కార్డ్ వాడి అతన్ని హౌజ్ లో నుంచి పంపడాన్ని ప్రేక్షకులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ హౌస్‌లోని దాదాపు అందరు కంటెస్టెంట్లు ప్రదీప్‌ అమ్మాయిల విషయంలో డేంజర్ అని చెప్పడం కూడా ఎవరికీ నచ్చలేదు.

ఇక ప్రదీప్ నిన్ననే హౌజ్ లో నుంచి బయటకు రాగా, కమల్ ఇలా చేసి ఉండకూడదు అంటూ నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. మరోవైపు ఆయన ఫ్యాన్స్ ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉండి, స్మాల్ స్క్రీన్ షోతో ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకుంటున్నాడు అని బాధ పడుతున్నారు. ఇక ప్రస్తుతం కమల్ ‘ఇండియన్ 2’, ‘థగ్’ అనే సినిమాలతో వెండి తెరపై ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు