Keerthy Suresh: సామ్ బాటలోనే కీర్తి సురేష్… ఆ సీన్స్ కు గ్రీన్ సిగ్నల్

మహానటి’ మూవీతో కీర్తి సురేష్ మరో సావిత్రి అనిపించుకుంది. ఇక అప్పటి నుంచి సౌత్ ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెను సాంప్రదాయ పాత్రలో చూడడానికే ఇష్టపడుతున్నారు. ఆ ఒక్క సినిమా కీర్తి సురేష్ ఇమేజ్ మొత్తాన్ని మార్చేసింది. ఈ సినిమాతో కీర్తికి నటిగా నేషనల్ లెవెల్ గుర్తింపు దక్కడం ప్లస్ పాయింట్ అయితే, ఇక ఆ తర్వాత ఆమెను పలకరించేవి అన్నీ అలాంటి పాత్రలే కావడం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. నిజానికి కీర్తితో పాటు వచ్చిన హీరోయిన్లంతా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షోతో దూసుకెళ్తున్నారు. కానీ కీర్తి సురేష్ కు మాత్రం మహానటి తెచ్చిన చిక్కుల వల్ల గ్లామర్ ఒలకబోసే అవకాశం దక్కలేదు. అయితే తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం కీర్తి సురేష్ కూడా ఇప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ సమంత బాటలోనే నడవబోతుందట.

సమంత రెండవ సినిమా నుంచి గ్లామర్ పాత్రలను చేస్తూ వచ్చింది. అయితే పెళ్లి తర్వాత పద్ధతి గల పాత్రలను ఎంచుకుంటుంది అని అనుకుంటే, ఫ్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్ లో బెడ్రూం సీన్స్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అలాగే ఇప్పుడు కీర్తి సురేష్ కూడా బోల్డ్ రోల్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అది కూడా బాలీవుడ్ కోసం. ఇప్పటికే కీర్తి సురేష్ బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి ఓ హాట్ రోల్ చేయడానికి సిద్ధపడింది. త్వరలోనే బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ కూడా చేయడానికి రెడీ అయిందట. ఈ నేపథ్యంలోనే ఓ హిందీ బోల్డ్ వెబ్ సిరీస్ కు కూడా కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

బాలీవుడ్ లోని ఓ బడా దర్శకుడు ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించబోతుండగా, ఈ సిరీస్ మాత్రం యాక్షన్ థ్రిల్లర్ అండ్ ఫుల్ బోల్డ్ సీన్స్ నేపథ్యంలో రూపొందబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో కీర్తి సురేష్ తనలోని బోల్డ్ యాంగిల్ ను బయటకు తీసి అందరికీ షాక్ ఇవ్వడానికి రెడీ అవుతోందట. దీంతో కీర్తి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు సంపాదించుకొని, బాలీవుడ్ లో మాత్రం ఓల్డ్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చిన హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. గతంలో చాలామంది హీరోయిన్లు ఇలాగే టాలీవుడ్ ను వాడుకుని బాలీవుడ్ లో స్థిరపడి పోవాలని చూశారు. మరి కీర్తి సురేష్ చేస్తున్న ఈ ప్రయోగాన్ని ఆమె అభిమానులు ఎలా తీసుకుంటారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు